13 July, 2016

యునెస్కో: “ఇస్లాం ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన మతం” అని మేము పేర్కొనలేదు

“ఇస్లాం ప్రపంచంలోని అత్యంత శాంతియుతమైన మతం” గా యునెస్కో సంస్థ ప్రకటించినట్టు పాకిస్తాన్ తమ అధికారిక “రేడియో పాకిస్తాన్” లో 11 జూలై నాడు ప్రసారం చేసింది. దాంతో పాటు ఈ అంశం పై 10 నిమిషాలపాటు చర్చ కూడా పెట్టి శ్రోతలకు వినిపించింది.  ఇలాంటి వార్తనే “జనతా కా రిపోర్టర్” అనే ఒక వ్యంగ్య ఆన్ లైన్ వెబ్ సైట్ కూడా ప్రకటించింది. 

ఈ విషయంపై యునెస్కో ఖండిస్తూ తమ సంస్థ ఏనాడూ కూడా “ఇస్లాం ప్రపంచంలోని అత్యంత శాంతియుతమైన మతం” అని, అట్లా అని ఎలాంటి అధికారిక ధ్రువ పత్రాన్ని కూడా జారీ చేయలేదు అని, ఇది తప్పుడు వార్త అని ప్రకటించింది. “జనతా కా రిపోర్టర్” అనే వెబ్ సైట్ ఒక వ్యంగ్య పూరిత వార్తలను వ్రాసేది అని పేర్కొంది.

యునెస్కో తమ పత్రిక ప్రకటనలో “ఇంటర్నేషనల్ పీస్ ఫౌండేషన్” అనే సంస్థకు యునెస్కో కు ఎలాంటి అధికారిక సంబంధం లేదు అని, అదే విదంగా ఇలాంటి వ్యాక్యలను తమ సంస్థ ఎప్పుడు కూడా సమర్ధించదు అని కూడా పేర్కొంది.  

ఈ విషయాన్నీ బట్టి చూస్తే, పాకిస్తాన్ తమ దేశ పౌరులకు మరియు “రేడియో పాకిస్తాన్” శ్రోతలకు ఎలాంటి పునః సమీక్ష చేయకుండా, ఆధారం లేని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ, అంతర్జాతీయంగా బాగా పలుకుబడి ఉన్నయునెస్కో లాంటి సంస్థను కూడా తప్పు దారి పట్టిస్తుంది అని అర్ధం అవుతుంది.

No comments:

Post a Comment