20 July, 2016

ఆర్.ఎస్.ఎస్ పై ఉన్న ఆరోపణల తొలగింపు - డాక్టర్ డేవిడ్ ఫ్రాలే

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎల్లప్పుడూ మత స్వేచ్ఛను  మరియు బహుళ ఆధ్యాత్మిక మార్గాలను అంగీకరిస్తూనే ఉంది .

-డాక్టర్ డేవిడ్ ఫ్రాలే

(రచయిత  అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్ లో  డైరెక్టర్ గా పనిచేస్తూ  యోగా మరియు వేద సాంప్రదాయాలపై  ముప్పై కు పైగా  పుస్తకాలు  రాసారు .)

చాలా మంది హిందువులకు దానగుణం లేదని మరియు బీదవారైనా తోటి హిందువులకు సహాయం చేయరని విమర్శిస్తారు. దీనికి కులం మరియు అస్పృశ్యతను ఉదాహరణగా చూపిస్తున్నారు .

ఈ సాకును చూపించి హిందూయేతర మరియు విదేశీ ఆధారిత ధార్మిక సంస్థలకు ప్రజలనుంచి నిధులను సేకరిస్తారు. అలాంటి వారు ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్చంధ సేవ సంస్థ  అయిన ఆర్.ఎస్.ఎస్  (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)  భారతదేశంలో ఉందని గుర్తించలేకపోతున్నారు. ఆర్.ఎస్.ఎస్  చాలా చురుకుగా ధార్మిక పనులలో జాతి, మతం భేదం లేకుండా చాలా విస్తారంగా పని చేస్తోంది.

ఆర్.ఎస్.ఎస్ దేశం యొక్క ఆధ్యాత్మిక విలువలను మరియు సంస్కృతిని సంరక్షించుకుంటూ దేశాన్ని అన్ని విధాలా ఉన్నత స్థానానికి తేవాలన్న జాతీయ దృష్టి తో పని చేస్తుంది. 

ప్రపంచంలో సామాజిక ఉన్నతికై పాటుబడే సేవా సంస్థలు అన్ని  దేశాల్లో కనిపిస్తాయి. చాలా దేశాల్లో  ప్రభుత్వానికి చెందిన నాయకులకు  అక్కడ జరిగే సేవ కార్యకలాపాలతో  సంబంధాలు ఉంటాయి. ఎక్కువగా సేవ సంస్థల పని మొత్తం ప్రజలకు సంభంధించిందైనప్పటికీ,  వాటికి మత పరమైన  అనుబందం కూడా ఉంటాయి.

విదేశీ ఆధారిత సేవ సంస్థల ప్రభావం మన మీద ఉంది . ఉద్దేశాపుర్వకంగా కావచ్చు లేదా మామూలుగానో వాటి వలన మనకు మన సంస్కృతి మరియు దేశం పట్ల ఉన్న మద్దతును అనచడంలో వాటి ప్రభావం కన్పిస్తుంది.
నా సమాజం నా అవసరాలు తీర్చలేకపోయినప్పుడు, ఎవరో బయటివారు తీరుస్తుంటే సహజంగా నా అభిమానం వారికే చెందుతుంది.

భారతదేశంలో బీదరికం మరియు నిరక్షరాస్యత ఇప్పటికి అనేక ప్రాంతాల్లో వ్యాపించి ఉండటంతో, సేవ సంస్థల వలన భారతదేశం బాగానే లాభం పొందుతోంది.  కానీ ఇక్కడ దేశీయ స్థానిక సేవ సంస్థలను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ప్రస్తుతం, కొన్ని విదేశీ ఎన్.జి. ఓ లు ప్రజలకు  సహాయ పడటం కన్నా వాటి దోపిడీ ఎక్కువయ్యింది మరియు డబ్బు బదిలీలు కూడా చేస్తున్నాయి.

వలస రాజ్య పాలనా కాలంలో భారతదేశం బాగా దోపిడీ కి గురైయింది మరియు దేశీయ స్వచ్చంద సంస్థలకు  వనరులు చాలా తక్కువుగా ఉండేవి. విదేశీ సేవ సంస్థల ముఖ్యంగా మతమార్పిడికి పని చేసే సంస్థలు ఈ అంతరాన్ని భర్తీ చేస్తున్నాయి.

నేటికీ హిందుమత ఆధారిత ధార్మిక సేవ సంస్థలు చాలా అరుదుగా గుర్తింపబడుతున్నాయి. ఆశ్యర్యం ఏమిటంటే, ఇంకా అనేక మంది భారతీయుల మనసులలో వలస విధానాన్ని అనుసరించే ధార్మిక సంస్థలపై సానుభూతి నిలిచిపోయింది.

ఆర్.ఎస్.ఎస్ యొక్క స్వరూపం

సంస్థలోని సభ్యుల సంఖ్య ఆధారంగా, దాని అనుబంధ సంఘాల పరిధి, దాని వలన  ప్రజలు పొందే మేలు దృష్ట్యా ఆర్.ఎస్.ఎస్, ఆధునిక భారతదేశం యొక్క అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మరియు సేవ సంస్థ.

ఆర్.ఎస్.ఎస్ ఒక మూసదోరణి తో ఉన్న సంస్థ కాదు. ఇది వ్యక్తులను మరియు స్థానికులు చేసే  ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థకు వివిధ క్షేత్రాల నుంచి వచ్చినవారు, వివిధ ఆలోచనా ధోరణిలు, మతాలకు చెందినవారు సభ్యులుగా ఉన్నారు.

ఆర్.ఎస్.ఎస్ ధార్మిక విలువలతో  మరియు అతి సాధారణ జీవన పద్దతితలో దేశానికి సేవ చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థలో చాలామంది తమ వ్యక్తిగత జీవితాలని త్యజించి పూర్తి సమయ కార్యకర్తలుగా, ప్రచారకులుగా అహర్నిశలు దేశానికి సేవ చేయడానికి ఉన్నారు.

ఆర్. ఎస్.ఎస్  మహిళలకు, దళితులకు, గిరిజనులకు, పిల్లలకు మరియు పేదవారికి అలానే జంతు మరియు పర్యావరణాన్ని రక్షించేందుకు  ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. 

రైతులకు, కార్మికులకు, విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు, సాధువులకు మరియు ఇతర సామాజిక వర్గాలకై పనిచేసే వారికొరకు కుడా ప్రత్యేక సంస్థలు  ఉన్నాయి. ఆర్.ఎస్.ఎస్  ప్రకృతి వైపరీత్యాలు మరియు విపత్తుల సంభవించినప్పుడు  సహాయం చేయడానికి ముందుకొచ్చే  తొలి సంస్థ. భారతదేశం లో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, అనేక సంస్థలు అంతర్జాతీయంగా  ఆర్.ఎస్.ఎస్ కు అనుబంధంగా  పని  చేస్తున్నాయి.

 

సంప్రదాయ, ఆధ్యాత్మిక మరియు యోగ జ్ఞానంతో  సామాజిక స్థాయిలో భారతదేశ  ఉన్నతి జరగాలన్న  స్వామి వివేకానంద దృష్టిని ప్రతిబింబించేలా ఆర్.ఎస్.ఎస్  పనిచేస్తోంది . దాంతో పాటు అనాది నుండి నేటి ఆధునిక కాలం వరకు దేశంలోని గొప్ప గురువులందరిని గౌరవించేలా కృషి చేస్తోంది.

 ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి మధ్య సంబంధం 

కొంతమంది రాజకీయ స్థాయిలో బి.జె.పికి  ఆర్.ఎస్.ఎస్ కు ఉన్న  సంబంధంతో భయపడుతున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా సమాజ సంక్షేమం కోసం పని చేసే సేవా సంస్థలకు  రాజకీయపరమైన ఆందోళన చెందటం సహజంగా గౌరవింపబడుతోంది.

కాబట్టి ఇటువంటి భారతీయ సేవ సంస్థ ను అర్థం చేసుకోవచ్చు మరియు ఇటువంటి సంస్థ అవసరం చాలా ఉంది.

ఆర్.ఎస్.ఎస్ జాతీయ మరియు సాంస్కృతిక ఐక్యతపై బలమైన దృష్టి కలిగి ఉన్నది. ఇది ప్రత్యర్ధులు చూపిస్తున్నట్టు అసహన హిందూ అతివాదమేమి కాదు.

ఆర్.ఎస్.ఎస్ ఎప్పుడూ మత స్వేచ్ఛను మరియు బహుళ ఆధ్యాత్మిక మార్గాలను అంగీకరించింది. కాని మోసపూరితమైన, బలవంతమైన మతమార్పిడి ప్రణాళకలను ఇప్పటికి వ్యతిరేకిస్తోంది. అయిన కాని ఇలాంటి మతమార్పిడులు జరుగుతూనే ఉన్నాయి.

భారతదేశంలో మార్క్సిస్టులు ఆర్.ఎస్.ఎస్ ను ఉగ్రవాద మరియు అతి ప్రమాదకరమైన సంస్థ గా  చూపించి పలుచన చేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ అదే మార్క్సిస్టుల హింసకు కేరళ పశ్చిమ బెంగాల్లో లోని ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు బాధితులుగా ఉన్నారు. ఇదే అతివాద వామపక్ష వాదులు  కులం, వర్గం పేరిట యుద్ధ తంత్రాన్ని ప్రోత్సహించారు కాని చైనా వంటి విదేశీ శక్తుల పట్ల సానుభూతి కలిగి ఉన్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారి యోగా, ఆధ్యాత్మిక, నిరాడంబరత మరియు కష్టపడి పని చేసే తత్వం చూసినట్లయితే మనకు ఆర్.ఎస్.ఎస్ నేపధ్యం ప్రతిబింబిస్తుంది . ఆయన దేశానికి మరియు ప్రజలకి అంకితమైన సేవకుడు.

ఆయన సమాజంలోని చిట్టచివర మనిషికి ఫలాలు అందే అభివృద్ధిని కోరుతూ పని చేస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి కేవలం ఆర్ధిక పరమైనదే కాకుండా విద్య మరియు సాంస్కృతిక పరమైనది.  ఈ తరహా అభివృద్ధి భారతదేశంలో అన్ని స్థాయిల్లో వికాసాన్ని అందుకోవాలన్న ఆర్.ఎస్. ఎస్ సంస్థ యొక్క దృష్టిని ప్రతిబింబిస్తుంది.

గత కాంగ్రెస్ ప్రభుత్వం లంచగొండితనం, వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి, దురాశాలతో నిండిపోయింది. ప్రస్తుత బి.జె.పి ప్రభుత్వం పై పెద్దగా లంచాల  కేసులు లేకపోవడమే కాక  ధార్మిక విలువలకు ప్రాధాన్యం ఇస్తోంది .

సిద్ధాంత పరంగా ఆర్.ఎస్.ఎస్ వాళ్ళతో అంగీరించక పోవచ్చు లేదా ఇతర సేవ సంస్థలు ఇంకా బాగా పని చేస్తున్నాయి అని అనుకోవచ్చు. కాని ఆర్.ఎస్.ఎస్ భారత దేశం యొక్క శ్రేయస్సుకై  అందిస్తున్న సహకారానికి మనం స్వాగతం పలకాలే కానీ, అపనమ్మకం, తప్పుడు సమాచారం తో కాదు.

No comments:

Post a Comment