05 August, 2016

"హిందూధర్మం సంఘటితం చేస్తుంది కానీ వేరు చెయ్యదు": ఆర్.ఎస్.ఎస్ అధినేత మోహన్ జీ భాగవత్

"వైవిధ్యమైన ప్రపంచంలో, ప్రతి సంస్కృతిని గౌరవించాలి, అన్ని సంస్కృతులు గౌరవించబడినప్పుడు, ప్రపంచం సుప్రతిస్టితమవుతింది," అని యు.కె. మరియు యూరోప్ దేశాల నుండి మహాశిబిర్ కు  హాజరైన  2,200 ప్రతినిధులు పాల్గొన్న సభలో ఆర్.ఎస్.ఎస్ అధినేత మోహన్ జీ భాగవత్ అన్నారు.



లండన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్డ్  షైర్ నగరం లో హిందూ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన  'సంస్కృతి మహాశిబిర్ ' యొక్క మూడు రోజుల సమావేశం ముగింపు సమావేశం లో వారు ప్రసంగించారు. ఈ సందర్బంగా వారు మాట్లుడుతూ ‘హిందూధర్మం అనేది ఒక జీవన పద్ధతి’ అని తెలుపుతూనే హిందూధర్మం అందరిని సంఘటితం చేస్తుంది కానీ వేరు చెయ్యదు అని అన్నారు.

వారి ఉపన్యాసం లో హిందూధర్మంలోని ‘వసుధైవ కుటుంబకం (ప్రపంచం  అంతా ఒక  కుటుంబం )’ గురుంచి దాని సానుకూల పరిణామాలు గురించి మాట్లాడారు.

అభివృద్ధి  మరియు పర్యావరణం మధ్య సంఘర్షణ గురించి కూడా మోహన్ జీ భాగవత్ మాట్లాడుతూ,  'అభివృద్ధికై వాతావరణంతో రాజీ పడవలసిందేనా' అన్న ప్రశ్నకు సమాధానం హిందూధర్మంలో లబిస్తుంది అని తెలిపారు.

“ఒక మంచి సమాజం అనేది క్రమశిక్షణతో కూడిన జీవనం మరియు వాళ్ళ చక్కటి ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యయాయం అనే వాటిపై ఆధార పడి ఉంటుంది.  అంటూనే వ్యయాయం అనేది ఆరోగ్యకరమైన శరీరానికి మరియు మనుసుకు చాల అవసరం అని అన్నారు. 

ఈ మూడు రోజుల మహాశిబిరం లో 'సంస్కారం' (జీవితం యొక్క విలువలు), 'సేవా' (నిస్వార్థ సేవ) మరియు 'సంఘటన్' (సంఘంతో ఆత్మ) వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.  

'సంస్కృతి మహాశిబిర్ ' మహాశిబిర్ లో  రామకృష్ణ వేదాంత సెంటర్ యు.కె. మఠాధిపతి అయిన శ్రీ స్వామి దయాత్మానంద, శ్రీ స్వామి నిర్లిప్తానంద (లండన్ సేవాశ్రమ్ సంఘ్ యు.కె. అధిపతి), ఆచార్య విద్యాబాలన్ భాస్కర్ (ఓంకారానంద ఆశ్రమం, స్విట్జర్లాండ్) తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment