శ్రీ టి.వి.దేశ్ ముఖ్ |
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ - కర్నాటక క్షేత్ర సంఘచాలక్ గా శ్రీ టి.వి.దేశ్ ముఖ్ ఎన్నికయ్యారు. 2012 మార్చ్ 16, 17, 18 తేదీలలో నాగపూర్ లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలలో జరిగిన ఎన్నికలలో శ్రీ టి.వి.దేశ్ ముఖ్ క్షేత్ర సంఘచాలక్ గా ఎన్నికయ్యారు.
శ్రీ టి.వి.దేశ్ ముఖ్ బాల్యం నుంచే స్వయంసేవక్ గా ఉన్నారు. వారి మేనమామగారు శ్రీ సీతారామారావు గారు నల్గొండ జిల్లాలో ఖండ సంఘచాలక్ గా పని చేశారు. వారి ద్వారా టి.వి.దేశ్ ముఖ్ గారు సంఘ పరిచయం లోకి వచ్చారు. స్వయంసేవక్ అయిన అనంతరం నుండి నేటి వరకు శ్రీ టి.వి.దేశ్ ముఖ్ సంఘ పనిలో కొనసాగుతూనే ఉన్నారు. సంఘ కార్యకర్తగా క్రియాశీలంగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు.
శ్రీ టి.వి.దేశ్ ముఖ్ పూర్తి పేరు తెడ్లపల్లి వెంకట నరసింహరావ్ దేశ్ ముఖ్. పాలమూరు స్వగ్రామం. విద్యాభ్యాసం అనంతరం ప్రచారక్ గా వచ్చి, మూడున్నర సంవత్సరాల పాటు నిజామాబాద్ జిల్లాలోని బోధన లో పని చేశారు. అనంతరం వివాహం చేసుకొని భాగ్యనగరంలోనే స్థిరపడ్డారు. వివాహానంతరం భాగ్యనగర్ దక్షిణ భాగ్ సంఘచాలక్ గా, అనంతరం నేరుగా పశ్చిమాంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ గా ఎన్నికై, నిరంతర క్రియాశీలకంగా ఉంటూ సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. ప్రాంత సంఘచాలక్ గా ఈ ప్రాంతంతోనూ, స్వయంసేవకులతోనూ వారికెంతో అనుబంధం ఉంది.
ప్రాంత సంఘచాలక్ గా ప్రాంతంలో జరిగిన వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ స్వయంసేవకులకు చక్కటి మార్గదర్శనం చేశారు శ్రీ టి.వి.దేశ్ ముఖ్. జన జాగరణ ఉద్యమాలలోనూ, వివిధ ప్రకృతి బీభత్సాలలో సంఘం నిర్వహించిన సేవా కార్యక్రమాలలోనూ (కర్నూలు, పాలమూరు లలో వచ్చిన వరదలు మొదలైన వాటి సందర్భాలలో) చురుకుగా పాల్గొని సమర్ధంగా నిర్వహించారు.
సంఘ కార్యకర్తగానే కాక వివిధ సామాజిక కార్యకలాపాలలో కూడా శ్రీ టి.వి.దేశ్ ముఖ్ క్రియాశీలకంగా పని చేశారు. జాగృతి ప్రకాశాన్ ట్రస్ట్ సభ్యులుగా, శ్రీ సరస్వతి విద్యా పీఠం వ్యవస్థాపక సభ్యులుగా, వైదేహీ ఆశ్రమం నిర్వహణ, ఇంకా అనేక ట్రస్టులలో క్రియాశీలక సభ్యులుగా పని చేశారు, చేస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 20: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్షేత్ర సంఘచాలక్‌గా రాష్ట్రానికి చెందిన తెడ్డపల్లి వెంకట నరసింహరావు దేశ్‌ముఖ్ ఎన్నికయ్యారు. నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాల్లో జరిగిన ఎన్నికల్లో టివి దేశ్‌ముఖ్ క్షేత్ర సంఘచాలక్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు ఆర్‌ఎస్‌ఎస్ ఇన్‌ఛార్జిగా ఉండనున్నారు. టివి దేశ్‌ముఖ్ బాల్యం నుండే స్వయం సేవక్ కార్యకర్తగా ఉండగా, ఆయన మేనమామ సీతారామారావు నల్లగొండ జిల్లాలో ఖండ సంఘచాలక్‌గా పనిచేశారు. ఆయన ద్వారా టివి దేశ్‌ముఖ్ సంఘంలోకి వచ్చారు. స్వయం సేవక్ అయిన తర్వాత నేటి వరకూ సంఘ పనిలో కొనసాగుతున్నారు. సంఘ కార్యకర్తగా ఉన్న దేశ్‌ముఖ్ అంచెలంచెలుగా ఎదిగారు.
ఆంధ్ర భూమి పత్రికలో ముద్రించబడిన వార్త
ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర సంఘచాలక్‌గా టివి దేశ్ముఖ్
- 21/03/2012
ఆంధ్ర భూమి పత్రికలో ముద్రించబడిన వార్త
2 comments:
మాననీయ టి వి దేశ్ముఖ్ గారికి అభినందనలు.
మాననీయ టి వి దేశ్ముఖ్ గారికి అభినందనలు.
-B.V.Prasad
9849998090
Post a Comment