16 October, 2014

హుదుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకుల సేవాకార్యక్రమాలు - విరాళాలకై విజ్ఞప్తి

విశాఖపట్టణంలోని హుదుద్ తుఫాను బాధితులకు ఆహారాన్ని, మంచినీటిని వితరణ చేస్తున్న స్వయంసేవకులు
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో హుదుద్ పెను తుఫాను భీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో ఎటుచూసినా కూకటివ్రేళ్లతో పెకలింపబడి రోడ్లకు అడ్డంగా పడిన చెట్లు, తీగలతో సహా విరుచుకుపడిన విద్యుత్ స్తంభాలు, కోసివేయబడిన రోడ్లు, దెబ్బతిన్న వాహనాలు, దెబ్బతిన్న ఇళ్లు, విరిగిపడిన టవర్లు, అడవిలా మారిన పచ్చని పర్యాటక కేంద్రాలు. ఇదీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిస్థితి.

తినడానికి తిండిగింజలు గాని, పిల్లలకు పాలు గాని, త్రాగడానికి కనీసం మంచినీరు గాని దొరకని పరిస్థితి. ఎవరికైనా చెప్పుకొందామన్నా చుట్టుప్రక్కల అందరూ తుఫాను బాధితులే. వేరే ఊరివాళ్లకు చెబుదామంటే నో సెల్ ఫోన్, నో కరెంట్, నో ట్రెయిన్స్, నో బసెస్, నో ఫ్లైట్స్. ఎటూ వెళ్లలేని పరిస్థితి. విశాఖ నగరంలోనైతే కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేక అల్లాడుతున్న పరిస్థితి. పిల్లలకు పాలు లేక, బండ్లకు పెట్రోలు లేక, ఇంటిలో వెలుతురు లేక, కనీసం దీపం వెలిగిద్దామన్నా కిరోసిన్ గాని, కనీసం నూనె కూడా దొరకని పరిస్థితి. ఇదీ 12వ తేది రాత్రి నుండి 16వ తేదీ ఉదయం వరకు ఉన్న భయానక స్థితి. 

హుదుద్ తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల ప్రాణనష్టం పెద్దగా లేకపోవడం అత్యంత సంతోషకరం. కాని ఆస్తినష్టం భారీగా, ఎన్నడూ లేనంతగా జరిగింది. 

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరాలలో తలదాచుకున్నారు. వీరికి పునరావాస కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం జరిగిన ప్రాణనష్టం పట్ల, ఆర్థిక నష్టం పట్లం తన విచారాన్ని తెలియచేస్తోంది. స్వయంసేవకులు అనేక కేంద్రాలలో పర్యటించి సేవకార్యక్రమాలు ప్రారంభించారు. 









ఇందుకోసం సంఘ స్వయంసేవకులు"జనసంక్షేమ సమితి" పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

మొదటగా స్వయంసేవకులు రహదారులకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించుటలో ప్రభుత్వ యంత్రాంగానికి తోడ్పాటునందించటం, నగరంలోను, శిబిరాలలో తలదాచుకొన్నవారికి కనీసం అవసరాలైన మంచినీరు, ఆహారాన్ని అందించటం వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించే పనిని ప్రారంభించారు. 

జనసంక్షేమ సమితి విజ్ఞప్తి : 

తుఫాన్ బాధితులకు పునరావాస కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాధితుల సహాయార్థం సహాయనిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సహాయ నిధికి విరాళాలు అందచేసి, మన సోదరులను ఆదుకోవలసినదిగా జనసంక్షేమ సమితి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. 

మీరు పంపవలసిన విరాళాలను జనసంక్షేమ సమితి, విజయవాడ ఆన్ లైన్ అకౌంట్ కు పంపగలరు. 

A/c No. 002601000013455
Indian Overseas Bank, 
Governorpet, Vijayawada-2.
IFSC Code : IOBA0000026.

ఈ విరాళాలకు 80G వర్తించును.

ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 

జనార్ధన్, విశాఖపట్టణం : 9494496900
మాధవ సదన్, విజయవాడ :  0866-2435199, 0866-2434892, 9391172916.

భవదీయ
భూపతిరాజు శ్రీనివాస్
అధ్యక్షులు
జనసంక్షేమసమితి.

No comments:

Post a Comment