14 July, 2016

రజ్జు భయ్యా గారి 13వ పుణ్యతిధి

దేశవ్యాప్తంగా ఈ రోజు ఆచార్య. రాజేంద్ర సింహ (29 జనవరి,1922- 14 జూలై, 2000) గారి 13 వ పుణ్య తిదిని పురస్కరించుకొని వారి చేసిన కార్యాలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు. రాజేంద్ర సింహ గారు 1993 నుండి 2000 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క నాలగవ సరసంఘచాలాక్ గా బాద్యతలు నిర్వహించారు.  వారు మన అందరికి రజ్జు భయ్యా గా సుపరిచితం. 


వీరి జన్మ స్థలం ఉత్తర ప్రదేశ్ లో షాజహంపుర్ గ్రామం. తల్లి జ్వాల దేవి, తండ్రి బల్బీర్ సింహ, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ గా పని చేసారు. వీరి విద్యాబ్యాసం, మెట్రిక్ పరీక్ష ఉన్నావ్ గ్రామం లో, తరువాత కొంత కాలం న్యూఢిల్లీ లో, పైన నైనిటాల్ లో జరిగింది. కేవలం 21 సంవత్సరాల వయసులోనే వారు అల్లహబాద్ యునివర్సిటీ నుండి బి.ఎస్.సి, ఎం.ఎస్.సి పట్టా పొందారు. 

నోబెల్ గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త, అయిన సర్ సి.వి. రామన్ గారు రజ్జు భయ్యా గారి ఎం.ఎస్.సి పర్యవేకేక్షకునిగా ఉన్న సమయంలోనే ఆధునిక అణు భౌతిక శాస్త్రం పై పరిశోధన చేయడానికి సహకారం అందిస్తానని అన్నారు. 

వారి చదువు అనంతరం అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా నియుక్తి చేయబడ్డారు. కొద్దికాలంలోనే అదే యునివర్సిటీ లోని భౌతిక శాస్త్రం విభాగానికి అధ్యక్షుడిగా గూడా పని చేసారు.

ఆ రోజుల్లో అణు భౌతికశాస్త్రంలో బోధించడం చాల అరుదు, అట్లాంటి సందర్బంలోనే వారిని ఒక నిపుణుడు గా పరిగణించేవారు. వారి విద్యా విధానం పూర్తిగా సరళత మరియు స్పష్టమైన విధానాలను జోడిస్తూ ఉండేది.

ఆర్.ఎస్.ఎస్. తో వారి అనుబంధం:

1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయం లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఆర్.ఎస్.ఎస్ పట్ల వారు ఆకర్షితులయినారు. అప్పటి నుంచి సంఘ ప్రభావం వారి మీద అధికంగా ఉండేది. 1966 లో యునివర్సిటీ భాద్యతల నుంచి రాజీనామా చేసి పూర్తి సమయ కార్యకర్త గా, ప్రాంత ప్రచారక్ గా సేవలు అందించారు.  ఉత్తర ప్రదేశ్ నుండి ప్రారంభమయిన వారి సంఘ జీవితం 1980 లో సర్ కర్యవాహ గా, 1994 లో బాల సాహెబ్ దేవరస్ తరువాత నాలగవ సరసంఘచాలాక్ నియుక్తి చేయబడ్డారు. 

వారు ఉత్తర ప్రదేశ్ లో ఉన్న సమయంలో లాల్ బహాదుర్ శాస్త్రి, చంద్రశేఖర్, వి. పి సింగ్ లాంటి వారితో కలిసి పని చేసారు. మురళి మనోహర్ జోషి వారి ప్రియ శిష్షులలో ఒకరు.  

రజ్జు భయ్యా గారు సరసంఘచాలాక్ వ్యవహరించిన 6 సంవత్సరాలు సంఘానికి మరియు భారత దేశానికి చాలా కీలకమయిన సమయం. సైద్ధాంతిక విబేధాల ప్రసక్తి లేకుండా వారికి రాజకీయ నేతలతో, మేధావులతో, విద్యవేత్తలతో సంఘ సంస్కర్తలలో తో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. 

1998 లో భారత రాజకీయాల్లో ఒక క్రియాశీల మార్పు చోటు చేసుకుంది, అందులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్రంలోని ఏర్పడిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ( ఎన్డీఏ )లో అతిపెద్ద పార్టీ గా అవతరించింది. ఇది భావ సారూప్యం కలిగిన బి.జె.పి కి మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి చాల కీలకం.

ఎమర్జన్సీ సమయంలో అజ్ఞ్యాతంగా ఉంటూ , దేశం మొత్తం పర్యటించారు. 1976 లో జస్టిస్ వి.ఎం. తార్కుండే గారి అద్యక్షతన జరిగిన మనవ హక్కుల సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు.   

గ్రామాలను ఆకలి లేని, రోగ రహిత మరియు విద్యావిద్యావంతమైనవి చేయడమే ఒక అత్యంత ప్రాధాన్యత అంశం గా ఆ దిశలో అభివృద్ధి కార్యక్రమాలను 1995 లోనే ప్రారంభించడం జరిగింది.  ఆ దశలో స్వయంసేవకలు కృషితో  ఇప్పుడు గ్రామీణాభివ్రుద్ధిని సాధించిన 100 పైగా గ్రామాలూ,  చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు మిగితా వారికీ స్పూర్తిదాయకంగా ప్రేరణను కలిగిస్తూ ఉన్నవి.

సంఘ యొక్క ప్రధానమైన నమ్మకాలలో ఒకటి: “ప్రజలంతా మంచివారే, కావున వ్యవహిరించేటపుడు వారిలో ఉన్న మంచితనం పై విశ్వాసం ఉంచాలి. కోపం, అసూయ, మొదలైనవి వారి గత అనుభవాల దృష్ట్యా వారి ప్రవర్తనను ప్రభావితం చేసి ఉంటాయి. ప్రధానంగా ప్రతి ఒక్కరు సజ్జనులే అందరు నమ్మదగినవారే.” 

నాగపూర్ లో 1995 విజయదశమి ప్రసంగంలో సింహ గారు, గాంధీ ని మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారిని స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం వారి ఆ ఇద్దరి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందా అని సవాలు చేసారు. 

రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి పేరు మీద దేశ రాజధాని ఢిల్లీ లో ఒక స్మారకాన్ని నిర్మంచాలి అనేది వారి కోరిక.
రజ్జు భయ్యా గారు ఫిబ్రవరి 2000 లో వారికి క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కే.ఎస్. సుదర్శన్ గారిని సరసంఘచాలాక్ గా సూచించడం జరిగింది.  14, జూలై 2003 నాడు పూణే లోని కౌశిక్ ఆశ్రయం లో తనువు చాలించారు.

No comments:

Post a Comment