12 July, 2016

ఆర్.ఎస్.ఎస్ పట్ల అధికమవుతున్న ప్రజాదరణ వలన పెంపొందుతున్నసంఘ కార్యక్రమములు: శ్రీ మన్మోహన్ వైద్య


గత 6 సంవత్సరములుగా సంఘ కార్యక్రమములు క్రమ క్రమముగా పెరుగుతున్నాయి అని రాష్ట్ర్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ మన్మోహన్ వైద్య గారు అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో మాట్లుడుతూ ప్రజలలో సంఘము పట్ల విశ్వాసము పెరగడం వలననే ఇది సాధ్యమైనదని ఆయన అన్నారు.  దీని కారణంగా సంఘ్ శాఖల సంఖ్య 57 వేలకు వరకు చేరింది.  దీనితో పాటుగా వారు జాకీరు నాయక్ యొక్క వ్యాఖ్యల గురించి చెప్పీ చెప్పకుండానే ప్రస్తావించారు.


బిఠూరులోని లవకుశ నగర్, కాన్పూర్ లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క ప్రాంత ప్రచారకుల మూడు రోజుల అభ్యాస వర్గ యొక్క మొదటి విలేఖర్ల సమావేశములో ఆయన మాట్లాడారు.  ఈ అభ్యాస వర్గ తరువాత రెండు రోజుల పాటు సమావేశాలు వుంటాయి. దీనిలో సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ గారు కూడా పాల్గొంటారు. గత రెండు రోజులుగా పత్రికలలో వస్తున్న వార్తలను చూసి సోమవారము నాడు జరిగిన పత్రిక విలేఖరుల సమావేశములో ఆయన మాట్లాడుతూ, ఈ అభ్యాస వర్గ ప్రాంత ప్రచారకుల కొరకు ప్రతి 5 సంవత్సరములకు ఒక సారి నిర్వహించబడుతుందనీ, మరియు 14, 15 నాడు ప్రాంత ప్రచారకుల సమావేశము ప్రతి సంవత్సరము జరుగుతుందని వెల్లడించారు.  గత ఐదు రోజులుగా మీడియా సంఘ సమావేశాలను భాజపాతో జోడించి ప్రస్తావించడము చూస్తున్నాను. ఇది సరైన పధ్ధతి కాదు.  ఈ సమావేశాలు సంఘ్ కి సంబంధించినవి. దీనితో భాజపాకు ఎటువంటి సంబంధమూ లేదు.  గత ఐదు సంవత్సరాలలో క్రొత్తగా వచ్చిన కార్యకర్తలకు ప్రచారకుల విధులు నియమ నిబంధనలు తెలియజేస్తారని ఆయన అన్నారు. సామాజిక సమస్యలు మరియు బౌధ్ధిక విషయాల గురించి చర్చలు మరియు రానున్న సంవత్సరములో ప్రవాసాల గురించి చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.  దీనితో పాటుగా సంఘ్ యొక్క ప్రచార- ప్రసారముల గురించి గూడా చర్చలు జరుగుతాయి.  సంఘ సమావేశాలు ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేయబడుటలేదు అని ఆయన అన్నారు. 2010 సంవత్సరము తరువాత సంఘ్ పట్ల ప్రజలకు విశ్వాసము పెరుగుతూ క్రమేపి ఎక్కువ అవుతున్నదని ఆయన అన్నారు. ఇందువలన 2010 సంవత్సరములో 45 వేల దగ్గరలో ఉన్నసంఘ్ శాఖల సంఖ్య ఇప్పుడు 57 వేలు దాటి పోయిందన్నారు.


గ్రామీణ క్షేత్రాలలో ప్రవేశించనున్న సంఘ్
సంఘ్ గురించి చేసిన ప్రచారము అబధ్ధములని సంఘ్ వైపు ప్రజలు ఆకర్షితులవడము నిరూపిస్తుందని డా. మన్మోహన్ వైద్య అన్నారు. గ్రామ గ్రామాలలో సంఘ్ సిధ్ధాంతాలను ప్రచారము చేయడము ద్వారా సంఘ్ పట్లగల దురభిప్రాయాలను దూరం చేయడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

జాకీరు యొక్క వ్యాఖ్యలు తప్పు
విలేఖరుల సమావేశములో డా. మన్మోహన్ వైద్యను జాకీర్ నాయక్ యొక్క వ్యాఖ్యలపై సంఘ్ యొక్క అభిప్రాయము ఏమిటని మీడియా అడిగినప్పుడు ఆయన దాటవేసే ప్రయత్నము చేశారు కానీ తరువాత వారు మీ అభిప్రాయమేమిటని మీడియానే ఎదురు ప్రశ్నించారు మరియు సంఘ్ యొక్క అభిప్రాయము మీ అభిప్రాయములకు మరియు ప్రజల అభిప్రాయములకు భిన్నము కాదని అన్నారు అది తప్పు అయితే  తప్పు అనే చెప్పాలి అన్నారు.

No comments:

Post a Comment