విజ్ఞాన భారతి సంస్థ
“జాతీయ స్థాయి అన్వేషిక నైపుణ్య పరీక్ష-2016” (NAEST-2016) ను తెలంగాణ వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఆగష్టు
14 నాడు నిర్వహించింది.
ఈ పరీక్షలో
భాగంగా, నిర్వాహకులు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా చిత్రీకరించిన ఏడు వీడియోలను చూపెట్టి
వాటి ఆధారంగా చేసుకొని ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది.
రాష్ట్రం
వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8, 9, 10 మరియు ఇంటర్మీడియట్
చదువుతున్న 1400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో ఈ
పరీక్షను బి.ఏం. బిర్లా సైన్సు సెంటర్ ఆడిటోరియం లో ఇండియన్ అసోసియషన్ అఫ్
ఫిజిక్స్ టీచర్స్ (IAPT) వారితో కలిసి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆధ్యర్యంలో నిర్వహించడం
జరిగింది.
ఈ నెల 20న ఈ పరీక్షలో
ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు తదుపరి నిర్వహించే రౌండ్ పరీక్షకు అర్హత పొందుతారు
అని పరీక్ష నిర్వాహకులు తెలియచేసారు.
ఈ సందర్బంగా జి.ఎల్.ఎన్
మూర్తి, విజ్ఞాన భారతి, తెలంగాణ ప్రాంత సమన్వయకర్త, మాట్లాడుతూ ఉపాధ్యాయులు మరియు
విద్యార్థులకు ప్రశ్నిచడం దానితో పాటు ప్రయోగాల తో విద్యాబోధన పై గల ప్రాముఖ్యతను
వివరించారు. ఇలాంటి బోధన పద్దతుల వలన పరిశ్రమలు
ఏర్పాటు చేయగలిగే అతస్థైర్యం పెరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ
శాస్త్రవేత్త శ్రీ జితేందర్ సింగ్, మరియు భాను ప్రకాష్ రెడ్డి, ఎన్.ఐ.ఎన్ శాస్త్రవేత్త,
తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment