12 August, 2016

అమలాపురం ఆవు అసలు కధ : వాస్తవాలను వక్రీకరించి ఇద్దరు మాదిగ కుటుంబాల గొడవని రాజకీయం చేస్తున్న అవకాశవాదులు

శ్రీనివాస రావు అవ్వారు

అమలాపురం ఆవు అసలు కధ…. అసలు దీంట్లో కులపరమైన దాడుల కోణమే లేదు ప్రత్యక్ష సాక్షి శ్రీ శివరామ కృష్ణ ప్రభుత్వపాఠశాల ప్రధాన ఉపాద్యాయులు

1. విద్యుత్ఘాతంతో మరణించిన ఆవు చర్మం ఒలుస్తున్న ఇద్దరు దళితులు ( ? ) .. ఒకరు ఎలీషా ఇంకొకరు లాజరస్, వారితోపాటున్న ఆటో డ్రైవర్ ఇతని కులం వలన పెద్దగా గిట్టుబాటు కాదేమో!! ఇతని కులం బయటపెట్టడం లేదు.. వీళ్ళని పశువుల దొంగతనానికి పాల్పడ్డారని కొట్టిన స్థానిక గ్రామస్తులువారు కాపు + గౌడ + రాజు సామాజిక వర్గాలకు చెందినవారు. 

2. గత నాలుగు నెలలుగా అమలాపురం పరిసర ప్రాంతాల్లో పశువుల దొంగతనాలు ఎక్కువయ్యాయి. వాటిని పోగొట్టుకున్న రైతులు కొన్నాళ్ళుగా ఈ సంఘటన పట్ల ఆగ్రహంగా ఉన్నారుఆ దొంగల్లో అన్ని కులాల వారూ అన్ని మతాల వారూ ఉన్నారు.. ఎక్కడన్నా అనుమానితులు కనబడితే వాళ్ళను ప్రశ్నించి దొంగలు కాదు అన్నతర్వాతే వదిలిపెడుతున్నారు

అలాగే పశుచర్మ వ్యాపారాన్ని నిర్వహించే జానకిపేట గ్రామానికి చెందిన 12 కుటుంబాలకు ఈ విషయమై సమాచారం ఇచ్చి ఎప్పుడన్నా అలా అక్రమంగా పశుచర్మాన్ని తీయాల్సి వస్తే చెప్పమని వారికి సమాచారం ఇచ్చారు..

3. ఈ నేపధ్యంలో జానకి పేట లో చర్మకార వృత్తిలో ఉన్న 12 కుటుంబాలలో రెండు వర్గాలున్నాయి. మొదటి వర్గానికి చెందిన మోకాటి ఎలీష. లాజరత్ లు తమకు అరవింద్ అనే వ్యక్తి ఇచ్చిన ప్రమాదవశాత్తు మరణించిన ఆవు మృతదేహాన్నుంచీ చర్మం ఒలవడానికి సోమవారం నాడు సూదపాలేం భట్టుపాలెం మధ్యనున్న శ్మశాన వాటిక దగ్గరకు చేరుకున్నారు. ఆ శ్మశాన వాటిక జానకి పేటకే చెందిన మోకాటి కుటుంబంతో మనఃస్పర్దలున్న యార్లగడ్డ ఏసురత్నం అనే వ్యక్తి ఆధీనంలో ఉన్నదిఅతను ఆ ప్రాంతంలో ఇంకొకరిని అనుమతించడు అటువంటింది కుటుంబపరంగా శతృత్వం ఉన్న ఈ మోకాటి ఎలీషా + లాజరస్ లను చూడగానే తనకు వాళ్ళమీద ఉన్న కోపాన్ని తీర్చుకోవాలనుకున్నాడు .. వెంటనే అప్పటికే తమ గోవులు కనబడక వెతుకుతున్న స్థానిక గౌడ వర్గానికి చెందిన రైతులకు మీ గోవులను మోకాటి ఎలీషా + లాజరస్ లు దొంగిలించి చంపి వాటిని సూదపాలెం శ్మశానవాటిక దగ్గర చర్మం ఒలుస్తున్నారు అని తప్పుడు సమాచారం ఇచ్చాడు.. ఆగ్రహానికి గురైన స్థానిక రైతులు ( అన్నికులాల వారు ఉన్నారుఅన్ని పార్టీల వారూ ఉన్నారు ఒక్క బి.జె.పి కి చెందిన వారు తప్ప… ) వారిని కొట్టడం జరిగింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ..

1 ఆవు దొంగతనం
2. రెండు కుటుంబాల మధ్య వైరం
3. దొంగలనుకుని కొట్టడం ..

ఈ మూడింటినీ వదిలేసి "గోరక్షా.. దాడిదళితుల మీద సామూహిక దాడులుఅని వక్రీకరించడం ఎవరి ప్రయోజనాల కోసం? ఏకంగా పార్లమెంటును సైతం తప్పుదోవ పట్టించారంటే "దళిత సోదరులను హిందుత్వం నుంచీ దూరం చేయడానికీ, జాతీయస్థాయిలో ఆర్.ఎస్.ఎస్ ను బద్నాంచేయడానికి ఏ అవకాశాన్ని ఈ జాతి వ్యతిరేక శక్తులు వదలడం లేదని స్పష్టం అవుతుంది. ఇటువంటి సవాళ్ళు హిందువులకు కొత్తకాదు, కానీ వాస్తవాలు బయటపడిన తర్వాత ఈ కుట్రల వెనుక ఉన్న శక్తులు ప్రజల్లో తమకున్న కొద్దో గొప్పో పరపతిని పోగొట్టుకుంటారన్నది నిజం.

No comments:

Post a Comment