21 April, 2012

జయము జయము భరతమమాత ! జయమునీకు జగన్మాత

ప్రియ భారత సహోదరులారా !
నిన్న భారతదేశచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ శుభదినం. 


ఇండియా అగ్ని-5 అనే ఒక అత్యంత శక్తిమంతమైన ICBM (Inter-Continental Ballistic Missile) ని పరీక్షగా ప్రయోగించి చూసింది. ఈ దెబ్బతో వ్యూహాత్మకంగా USA, UK, చైనా, ఫ్రాన్సు దేశాల కోవలోకి ఇండియా కూడా చేఱిపోయింది. దీని రేంజి 5,000 కిలోమీటర్లు మాత్రమేనని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలు రేంజి 8 లేదా 9 వేల కిలోమీటర్లకి తగ్గదని ప్రపంచదేశాలు అనుమానిస్తున్నాయి. నిజానికి ఇలాంటి వ్యూహాత్మక విషయాల్లో పత్రికలలో వచ్చే వార్తాకథనాల వెనక ఇంకా చెప్పబడని అసలుకథ చాలా ఉంటుంది. అంటే ఈ తరహా క్షిపణులతో యావత్తు ఆసియా, యూరప్, ఉత్తరాఫ్రికాలలోని అన్ని శత్రుదేశాల్నీ చుట్టబెట్టే పోరాట పటిమని ఇండియా సాధించిందన్నమాట. ఈ వార్తతో ఇప్పటికే చైనా గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అయినా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఈ క్షిపణిప్రయోగం గుఱించి అమెరికా ఒకపక్క లోలోపల ఏడుస్తోంది. కానీ ఇంకో పక్క సంతోషిస్తోంది, చైనాకి ఒక ప్రాంతీయ సవాల్ ఏర్పడిందని !


[ఎప్పుడు కూడా  బలవంతుడే గౌరవింప బడతాడు . దేశానికి బలవంతులు కావాలి . దేశం సమున్నతమై వెలగాలని కోరుకునే పౌరులు కావాలి . అటువంటి పౌరులద్వారానే మాతృభూమి మన్ననలు పొందుతుంది అంతేకాని ఇక్కడ తిండి తింటూ  అక్కడి పాటలు పాడేవాళ్ళు కాదు . రంగు  నీళ్ళ కంపెనీలకు  పొరుగుదేశాల ఏజంట్లుగా మారి భారత దేశాన్ని బలహీనపరుస్తున్న కుహనమేధావుల కుతర్కాలతో కాదు ] జేజేలు పలకండి మనశాస్త్రవేత్తలకు .  

Source : Hari Seva

1 comment:

Dr. Metuku Bala Pocha Ayya said...

Arya,

Chaalaa Manchi Vaarta. Santoshamu, Baagaa Vraasaaru, Prati Hinduvoo Kooda Garvinchali.

Janaab Digvijaya Singh ki santaapamu teliya jestunnanu.

Dr. Metuku

Post a Comment