28 July, 2014

రేకుల షెడ్డులో అభ్యాసం - కామన్ వెల్త్ లో పతకం - మెరిసిన తెలుగుతేజం

రేకుల షెడ్డులో శిక్షణ..
పేదరికమే; అయినా పతకాల వెల్లువ..
కామన్వెల్త్‌లో తళుక్కుమన్న తెలుగు తేజం..

సంతోషి

ఈ తెలుగు తేజం విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మత్స సంతోషి. ప్రస్తుతం స్కాట్లాండ్ దేశంలోని గ్లాస్గోలో జరుగుతున్న 20వ కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్ననాటి నుండే వెయిట్ లిఫ్టింగ్‌పై మోజు పెంచుకుంది. స్వీయ శిక్షణను అలవర్చుకుంది. ఇంటి పక్కనే ఉన్న చిన్నపాటి స్థలంలో రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని ప్రతీరోజూ సాధన చేస్తుండేది. ఆ రేకుల షెడ్డే ఆమెకు దేవాలయం, సంతోషి ఇప్పటి వరకూ అనేక పతకాలు సాధించింది.

రేకుల షెడ్డులో అభ్యాసం చేస్తున్న సంతోషి
సంతోషి అభ్యాసం చేస్తున్న రేకుల షెడ్డు, పై ఫోటోలో ఆమె సాధించిన పతకాలు

  • *2005లో స్టేట్ చాంపియన్ షిప్,
  • *2006 నుంచి 2013 వరకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ విభాగంలో పతకాలు.
  • *2010లో ఉజ్బెకిస్తాన్‌ సబ్ జూనియర్ ఏషియాడ్‌లో బంగారు, రజత పతకాలు.
  • *2010 లో జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 6వ స్థానం,
  • *2010 లోసింగపూర్ యూత్ ఒలింపిక్స్‌లో 5వ స్థానం.
  • *2010లో మలేషియా కామన్వెల్త్ యూత్ జూనియర్ చాంపియన్‌షిప్‌ బంగారు పతకం. 
  • *2011లో ధక్షిణాఫ్రికాలో జరిగిన చాంపియన్‌షిప్ జూనియ్ విభాగంలో బంగారు పతకం. 
  • *2012 మలేషియాలో జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో బంగారు పతకం.
  • తాజాగా 20వ కామన్వెల్త్ క్రీడా పోటీల్లో 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, తన గ్రామానికి కీర్తిని తెచ్చిపెట్టింది సంతోషి. 

 ప్రతిభ మాసొంతం..' అంటూ మొత్తుకునే కొన్ని వర్గాలవారికి ఈ గ్రామీణ, మధ్యతరగతి అమ్మాయి ప్రతిభ చెప్పుదెబ్బలాంటిది..@ జనబంధు.



Courtesy : Janabandhu

No comments:

Post a Comment