హిందూ శక్తి సంగం వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా |
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలుగు రాష్ట్రాల్లో నిజాం పాలన తేవాలని చూస్తే
ప్రతి పౌరుడూ సర్దార్ పటేల్ అవుతాడని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక
అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ భాయ్ తొగాడియా హెచ్చరించారు. ఎన్టీఆర్
స్టేడియంలో విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంత్యుత్సవాల సందర్భంగా ఆదివారం
రాత్రి నిర్వహించిన హిందూ శక్తి సంగమ కార్యక్రమంలో ప్రవీణ్ భాయ్ తొగాడియా
దేశ, రాష్ట్ర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం
అనుసరిస్తున్న విధానాలను ఆ పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు. లాహోర్
రావల్పిండిపై జాతీయ పతాక ఎగురవేసి అఖండ భారతావనిని నిర్మించిననాడే
విహెచ్‌పికి అసలైన ఉత్సవాలన్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని, దేశంలో ప్రతి హిందువు హృదయం అదే చెబుతోందన్నారు. ముస్లింల తీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ, నలుగురు భార్యల పద్ధతి పోవాలి, కామన్ సివిల్ కోడ్ రావాలని చెప్పారు. మక్కాకు, లేదా జెరూసలేంకి వెళ్తామంటే రాయితీలా? తిరుపతికి మాత్రం ఇవ్వరా? అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఉర్దూ అకాడమికి మూడు కోట్లు ఇచ్చే ప్రభుత్వం తెలుగు అకాడమికి 30 లక్షలు ఇస్తుంది. వారికి నౌకరీలు, వీరికి అక్కర్లేదా? అని ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి హిందువూ జాగృతి కావల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో 30 శాతం హిందువులు ఉండేవారని, అదిప్పుడు 8 శాతానికి తగ్గిందన్నారు. పాకిస్తాన్‌లో పది శాతం హిందువులు ఉండగా అది కేవలం ఒక శాతానికి పడిపోయిందని, ప్రపంచమంతా తొలుత హిందువులతోనే ఉండేదని, భారత్ వంద శాతం హిందువులతో ఉండేదన్నారు. నేడు పరిస్థితి దారుణంగా ఉందని, రెండు వేల సంవత్సరాలున్న హిందూ సమాజంలో ఒక్క హిందువు కూడా విద్యలేకుండా అనారోగ్యంగా ఉండరాదని, ''సురక్షకు మరో అర్థం హిందువుల సంఖ్య తగ్గరాదని'' అన్నారు.
హిందువుల ఐక్యత చాలా ముఖ్యమని, కోట్లాది హిందువులు పునఃసమృద్ధి సంకల్పం తీసుకోవాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏకైక ధర్మం హిందూత్వమని ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఉద్ఘాటించారు. అన్ని రంగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవాలని పేర్కొన్నారు. ప్రాధమిక విద్య, ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతే అయినా తాము సైతం చేయూతనిస్తున్నామన్నారు. పూర్వీకులు హిందువులైన వారంతా తిరిగి తమ సొంత మతంలోకి రావాలని, వారందర్నీ హత్తుకుంటామని ప్రవీణ్‌భాయ్ తొగాడియా చెప్పారు.
Courtesy : Andhra Bhoomi

No comments:
Post a Comment