హైదరాబాద్, డిసెంబర్ 28: గుడిని, బడిని మనం కేంద్రాలుగా చేసుకుని ధర్మరక్షణకు పాటుపడాలని, బడివల్ల సంస్కారం, గుడివల్ల భక్తి లభిస్తుందన్నారు. హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసమే విహెచ్‌పి ఆవిర్భవించిందని విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షులు జి.రాఘవరెడ్డి అన్నారు.
విశ్వహిందూ పరిషత్ స్వర్ణ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భాగ్యనగర్ హిందూ శక్తి సంగమం, హనుమాన్ చాలీసా కోటిపారాయణ యజ్ఞం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వం ఉర్దూ అకాడమీకి 30 కోట్లు కేటాయించి ప్రాంతీయ తెలుగుభాషకు కేవలం 30 లక్షలు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింలను హజ్‌యాత్రకు, క్రైస్తవులను జరూసలెంకు పంపుతున్న పాలక ప్రభుత్వాలు ఏ ఒక్క హిందువునైనా తిరుపతికి పంపిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షులు రామరాజు మాట్లాడుతూ గోరక్షణ, మతమార్పిడిల నిరోధన, మఠమందిరాల పరిరక్షణ, హిందూధర్మ పరిరక్షణ, హిందూ దేశ పునర్నిర్మాణం తదితర ఐదు ఆంక్షలతో తీసుకున్న సంకల్పంతో నేడిక్కడ హిందూ శక్తి సంగమం జరుపుకుంటున్నట్లు వివరించారు. రానున్న ఆరు మాసాల్లో ప్రతి హిందువు నేత్ర, రక్తదానానికి, గోరక్షణకు సిద్ధం కావడానికి సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిహిందువు దేవతా వృక్షాలైన మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, ఉసిరి, మారేడు, తులసి వంటి చెట్లను నాటాలని సూచించారు. రానున్న ఉగాదినుండి శ్రీరామ నవమి వరకు ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామీజీ, విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ (హంపి పీఠాధిపతి), కమలానంద భారతీ స్వామీజీ (హిందూ దేవాలయాల ప్రతిష్టాన పీఠం), సుబుదేంద్ర తీర్థస్వామీజీ (మంత్రాలయ మఠాధిపతి), మాడుగుల నాగఫణిశర్మ, సత్యాప్రదానంద స్వామీజీలతోపాటు పలువురు పీఠాధి, మఠాధిపతులు, సాధు సంతులు పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర శాసనసభాపక్షనేత డా.కె.లక్ష్మణ్, ఆరెస్సెస్ సర్ కార్యవాహ, విహెచ్‌పి అంతర్జాతీయ నేతలు చంపత్‌రాయ్‌జీ, దినేష్‌చంద్రజీ, వై.రాఘవులు, రాష్ట్ర స్వర్ణ జయంతి కమిటీ చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, విహెచ్‌పి నేతలు సురేందర్‌రెడ్డి, బండారు రమేష్, స్వర్ణజయంతి కమిటీ భాగ్యనగర్ చైర్మన్ నగునూరి చంద్రశేఖర్, విహెచ్‌పి భాగ్యనగర నేతలు డా.ప్రభాకరరావు, బండారు సత్యనారాయణ, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ కమిటీ చైర్మన్ కర్నె శ్రీశైలం, విహెచ్‌పి మహిళా ప్రముఖ్ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Courtesy : Andhra Bhoomi
No comments:
Post a Comment