“నీ ఒళ్ళు బంగారం గాను” అన్నట్లుగా ప్రసిధ్ధ గిర్ ఆవు
అక్షరాలా బంగారు ఆవే. జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల నాలుగేళ్ళ
విస్తృత పరిశోధనల ఫలితంగా గిర్ ఆవు మూత్రంలో బంగారంను గుర్తించారు. విశ్వ
విద్యాలయములోని ఆహార పరీక్షా ప్రయోగశాలలో 400 గిర్ ఆవు మూత్ర
నమూనాల విశ్లేషణ పిదప ప్రతి లీటరుకి 3 నుండి 10 మిల్లీ గ్రాముల వరకు బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. నీటిలో కరిగే బంగారు
లవణాల రూపంలో ఇది లభిస్తున్నట్లు గుర్తించారు.
“ఇప్పటి వరకు మనకు దేశీ ఆవు మూత్రంలో బంగారం ఉన్నట్లు భారతీయ ప్రాచీన
గ్రంథాలద్వారా, ఔషధ లక్షణాల ద్వారా మాత్రమే విన్నాము. కాని ఈ విషయాన్నీ నిరూపించడానికి విస్తృత శాస్త్రీయ విశ్లేషణ వివరాలు లేనందువల్ల
మేము ఆవుమూత్రం పై పరిశోధన చెయ్యాలని నిర్ణయించాము. మేము 400
గిర్ ఆవు మూత్ర నమూనాలను విశ్లేషించి అందులో బంగారం జాడలు ఉన్నట్లు కనుగొన్నాము”
అని శ్రీ గొలాకియా గారు అన్నారు.
విశ్వ విద్యాలయపు
బయోటెక్నాలజీ విభాగపు అధికారి డా. బి.ఏ. గొలాకియా గారి నేతృత్వంలో పని చేసిన పరిశోధక బృందం మూత్రనమూనాలను
విశ్లేషించడానికి “గ్యాస్ క్రోమేటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ”
(GC-MS) పధ్ధతులను ప్రయోగించారు.
గో మూత్రము నుండి బంగారాన్ని
వెలికితీసి రసాయనిక పధ్ధతుల ద్వారా
ఘనీభవించవచ్చు అని కూడా శ్రీ గొలాకియా గారు చెప్పారు. ఈ పరిశోధన బృందం ఒంటెల, గేదెల, గొఱ్ర్రెల, మేకల యొక్క మూత్రాల నమూనాలను సైతం విశ్లేషించింది, కాని వాటిలో ఏ
విధమయిన రోగ నిరోధక పదార్థాలు ఉన్నట్టు బయట పడలేదు. వారు పరిశోధించిన 5100 గిర్
ఆవు మూత్ర సమ్మేళనాలలో 388 నమూనాలలో వివిధ
రుగ్మతలను నివారించగలిగే ఔషధ
గుణాలున్నట్లు శ్రీ గొలాకియా గారు తెలిపారు. వీరి పరిశోధనకు సహాయకులుగా శ్రీ
జైమిన్,
శ్రీ రాజేశ్ విజయ్ మరియు శ్రధ్ధా గారు పనిచేసారు.
ప్రస్తుతం వీళ్ళు భారత దేశంలోని 39
దేశీయ జాతి ఆవు మూత్ర నమూనాలపై ఇదే అంశం పై పరిశోధన కొనసాగించనున్నారు.
“ప్రస్తుతం, మేము గిర్ గోమూత్రాన్ని మనవ మరియు
మొక్కల రోగ నిరోధానికి మరియి చికిత్సకు ఎలా ఉపయోగించవచ్చు అనే దాని పై ప్రయోగాలు
చేస్తున్నాము” అని శ్రీ గోలాకియా గారు తెలియచేసారు.
జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయపు “ఆహార పరీక్షా ప్రయోగశాల” “నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్” ద్వార గుర్తింపు పొందినది. ఈ ప్రయోగశాల ప్రతి సంవత్సరము
సుమారుగా 50,000 పరీక్షలు చేస్తుంది, అందులో
ఎగుమతి చేయు పాల పదార్థలు, కూరగాయలు, దినుసులు, నూనె గింజలు, తేనె, పురుగు మందుల
మిగుళ్ళు మరియు వివిధ వస్తువులు ఉంటాయి. ఈ ప్రయోగశాల జునాగఢ్ వ్యవసాయ
విశ్వవిద్యాలయం, అహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR) మరియు గుజరాత్ వ్యవసాయ పరిశ్రమల సమాఖ్య (Gujarat Agro-Industries
Corporation) ల ద్వార నెలకొల్పబడ్డ ఉమ్మడి
సంస్థ.
(Courtesy: Times of India)
(Courtesy: Times of India)
No comments:
Post a Comment