హైదరాబాద్ లో
భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ISIS ఉగ్రవాదులను
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసి
ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఆ ఉగ్రవాదులు అమాయకులని వారికి న్యాయ సహాయాన్ని
అందిస్తామని ప్రకటించిన ఎం.ఐ.ఎం. అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తెలంగాణ
వ్యాప్తంగా ప్రజలు ముఖ్యంగా బజరంగ్ దళ్, వి.హెచ్.పి మరియు బి.జె.పి కార్యకర్తలు
తీవ్ర నిరసన తెలుపుతూ ఒవైసీ దిష్టి బొమ్మను పలు నగరాలలో దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలు
మరియు నాయకులు మాట్లాడుతూ ఎం.ఐ.ఎం పార్టీ తీవ్రవాద ముసుగు వేసుకున్న రాజకీయ
పార్టీ అని వెంటనే దాన్ని బహిష్కరించి దేశ ద్రోహానికి పాల్పడిన
అసదుద్దీన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం చేసారు.
పట్టుబడ్డ
ఉగ్రవాదులను మరియు వారి దేశ వ్యతిరేక చర్యలను ముక్త ఖంఠంతో విమర్శిచాల్సింది పోయి
జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్.ఐ.ఏ చేసిన ఆరోపణల వెనుక ఉన్న నిజ నిజాలను
నిర్ధారించుకోకుండా మాట్లాడం వలన సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు అని
అన్నారు. అంతే కాకుండా ఎన్.ఐ.ఏ పట్టుకున్న
నిందితులకు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు అని ఆరోపించారు.
పక్కా ఆధారాలో
ఎన్.ఐ.ఎ, తెలంగాణ పోలీసులు
ఉగ్రకుట్రను భగ్నం చేసి నిందితుల నుంచి మారణాయుధాలు, ప్రమాదకర రసాయనాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ
మజ్లిస్ అధినేత మాత్రం వారిని అమాయకులుగానే చిత్రీకరించడం లో రాజకీయం ఏంటిది అని ప్రశ్నించారు.
ఓ వైపు భారీ
కుట్రను చేధించిన పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే ఎంఐఎం మాత్రం
నిందితుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తుంది. మజ్లిస్ దుష్ట రాజకీయంలో ఇదొక ఉదాహరణ
మాత్రమే అని, ఉగ్రవాదులకు, దేశద్రోహులకు మతం
పేరుతో మద్దతు తెలుపుతున్న మజ్లిస్ లాంటి పార్టీలు, దేశ ప్రయోజనాల కన్నా స్వార్థ రాజకీయాలే
పరమావధిగా మారి వారితో దోస్తీ చేసే పార్టీలుండడం దురదృష్టకరం అని కూడా అన్నారు.
ఏంపీ అసదుద్దీన్
ఒవైసీ పై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై వారు గవర్నర్ నరసింహన్‌తో కూడా భేటీ అయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసదుద్దీన్ వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని
తెలిపారు.
Courtesy: Andhra Jyothi |
No comments:
Post a Comment