18 July, 2016

సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న బాలగోకులం భారత

భారతీయ హిందూ మూలాలను సంరక్షిస్తూ, ముఖ్యంగా వాటిని ఈ తరం పిల్లలకు పరిచయం చేస్తూ, మన సంసృతి సంప్రదాయాల విశిష్టతతో వారి జీవన తొలి అడుగులు ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించే ‘బాలగోకులం’ వారు భాగ్యనగర్ (హైదరాబాద్)- మియాపూర్, జనప్రియ నగర్, లోని ఆర్ .వి. అవనీంద్ర అపార్ట్ మెంట్స్ నందు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 17-జూలై-2016 న వార్షికోత్సవం నిర్వహించారు.


75మంది బాలగోకులం విద్యార్థులు, 250 మంది ప్రేక్షకులుగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అపార్ట్ మెంట్ రక్షణ బాద్యతలు చూసే వారి పిల్లలు పాడిన గణేశ వందనం మరియూ సరస్వతి వందనం ద్వారా ప్రారంబించడం జరిగింది.  కార్యక్రమంలో పిల్లలు యోగా, కోలాటం, యోగ్చాప్ , సంస్కృతం లో నీటి పొదుపు పైన నాటకం, ఉష్ణోగ్రత మార్పుల మీద ఒక నృత్య రూపిక నృత్యాలు, పాటలు ఇతర సాంసృతిక కార్యక్రమాలతో అలరించారు


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ ఎస్. సత్యనారాయణ, విశ్రాంత డీ.సీ.పీ, శ్రీ నడింపల్లి ఆయుష్, ఆర్.ఎస్.ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్, మరియు అడ్రోయోటెక్ సొల్యూషన్ సంస్థ సి.ఈ. ఓ గారు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. విశేషంగా ఈ కార్యక్రమంలో ఆర్ .వి. అవనీంద్ర అపార్ట్ మెంట్స్ ప్రెసిడెంట్ శ్రీ పార్ధసారధి గారు వీరిని తులసి మొక్కతో స్వాగతం పలికారు.



శ్రీ ఎస్. సత్యనారాయణ గారు మాట్లాడుతూ యోగా ద్వారా పిల్లలలో ఆరోగ్యం, దేహదారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం మరియు ఆత్మస్థైర్యం పెరుగుతాయని అని అన్నారు. బాలగోకులం వంటి కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా పెంచవలసిన అవసరం ఉన్నదీ అని కూడా అన్నారు. శ్రీ ఆయుష్ గారు మాట్లాడుతూ, విశ్వవ్యాప్తంగా సంస్కృతం యొక్క విలువను, సంఘం యొక్క బాలగోకులం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భారత దేశ యొక్క భవితవ్యంను ఎలా మార్చవచ్చో వివరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి ద్వారా 47మంది పిల్లలు వారి చేతి వ్రాతతో రాసిన వ్యాసాల ప్రచురణను ఆవిష్కరించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో బాలగోకులం మహానగర ప్రముఖ్ శ్రీ విక్రాంత్ షా గారు, బాలగోకులం మహానగర సహ ప్రముఖ్  శ్రీ లక్ష్మణ్ రావు గారు,  ఐ.టి. మిలన్స్ మహానగర కార్యవాహ్ శ్రీ మిలింద్ శాఖాయి, ఐ.టి. మిలన్స్, జనప్రియ నగర స్వయంసేవకులు, సేవికా సమితి నుంచి సేవికలు మరియు  ఇతర బాలగోకులాల వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు





No comments:

Post a Comment