05 July, 2016

ఆర్.ఎస్.ఎస్ అనుసంధాన హిందుస్థాన్ సమాచార్ పత్రిక విస్తరణ ప్రయత్నాలు

ఆర్.ఎస్.ఎస్ కి అనుసంధానమైన "హిందుస్థాన్ సమాచార్" వార్త పత్రిక ఎన్.డి.ఎ ఫ్రభుత్వ సహకారం తో ప్రధాన విస్తరణ కి పూనుకుంది. ఇటీవలే విడుదలైన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కొత్త విధానం ప్రకారం "హిందుస్థాన్ సమాచార్" వార్తాపత్రిక కు ప్రభుత్వ ప్రకటనలను ప్రచురించే వీలు కలిగిస్తుంది, ఈ అవకాశం అదనపు ఆదాయం సంపాదనకి వీలు కలిగిస్తుంది.

"హిందుస్థాన్ సమాచార్" వార్తాపత్రిక ను 1948 లో ఆర్.ఎస్.ఎస్ ప్రచారకర్త శ్రీ శివరాం శంకర్ ఆప్టే గారు ప్రారంభించారు. ఈయన M S Golwalkar తో కలిసి "విశ్వ హిందు పరిషత్" ను కూడా ప్రారంభించారు. ఈ వార్తాపత్రికను ఇందిర గాంధీ ప్రభుత్వం అత్యవసర సమయంలో నస్టాలకి గురైన కారణంగా 1986 లో మూసివేయపడింది. తరువాత 2000 లో శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి ప్రభుత్వం సమయం లో పునరుజ్జీవనం జరిగింది.

ఈ సవరణ ద్వార పత్రిక చందా (subscription) ఆదాయం పెంచడానికి సహాయపడుతుంది మరియు లక్షల మంది కి చేరువకావడానికి దోహదపడుతుంది. 8000 చిన్న మరియు మద్య తరహా వార్తా పత్రికలను, “ప్రకటనలు మరియు దృశ్య ప్రచార” అధికార విభాగం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం, కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను ప్రింట్ మీడియా లో ప్రకటనలు కొరకు ఖర్చుచేసింది. ఈ విధానం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్కింగ్ స్కీం ను పరిచయం చేసి ప్రకటనలను కు అత్యధిక ప్రభావం చూపే వార్తా పత్రికలను గుర్తించింది. 100 కు 45 పాయింట్స్ సంపాదించిన వార్తా పత్రికలకు ప్రభుత్వం ప్రకటనలను ప్రచురించే అవకాశం కలిగిస్తుంది. ఈ నూతన విధానం ద్వారా పారదర్శకత పెంపొందించ చేయడానికి అవకాశం కలుగుతుంది

No comments:

Post a Comment