రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి గారి పత్రికా ప్రకటన
ప్రస్తుతము
దేశవ్యాప్తంగా షెడ్యూలు కులాల బంధువులపైన జరుగుతున్న అత్యాచారాలు మరియు ఉత్పీడన
కలిగించే సంఘటనలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా గర్హిస్తున్నది మరియు
వ్వతిరేకిస్తున్నది. చట్టమును తమ చేతిలోకి తీసికొని తమ సమాజములోని వ్యక్తుల పట్ల
చేస్తున్న ఇటువంటి చర్యలు అన్యాయమే కాకుండా అమానుష చేష్టలుగా ప్రకటిస్తాయి.
ప్రసార మాధ్యమాలు
ఇటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొన్న విషయాలను ఆధారం చేసికొని
సమాజంలో సుహృద్భావనను పెంపొందించడానికి బదులుగా అవిశ్వాసము, అశాంతి మరియు సంఘర్షణ పెంచడానికే పని
చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ పరిస్థితి శోచనీయము. విభిన్న రాజకీయ దళాలు,
జాతి, కుల ప్రాతిపదిక మీద తమతమ అవకాశవాదముతో అసంపూర్ణమైన విషయాలను తెలిపి సమాజములో
అల్లకల్లోలములను రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సమాజ సమరసతకు అహితము. రాజకీయ దళాలు మరియు కుల పెద్దలు సమాజములో
ప్రస్తుతము వున్న ఇటువంటి పరిస్థితులను జన సహకారంతో చక్కదిద్ది అటువంటి పీడిత
ప్రజలపట్ల సంవేదన వ్యక్తంచేసి అటువంటి సంఘటనలు పునరావృత్తము కాకుండా చూడవలసినదని
సంఘ్ విజ్ఞప్తి చేస్తున్నది.
No comments:
Post a Comment