జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీలో ఇటీవల జరిపిన దాడికి గట్టి
బదులిచ్చింది.. పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై
మెరుపు దాడులు జరిపి 9 మంది పాకిస్థాన సైనికులను, 38 మంది ఉగ్రవాదులను
హతమార్చింది.. భారత సైన్యం పారాచూట్ల సాయంతో పీవోకేలోకి ప్రవేశించి
పని పూర్తి చేసుకొని విజయవంతంగా తిరిగి వచ్చింది.. నిన్నఅర్థరాత్రి
దాటిన తర్వాత 12.30గంటల ప్రాంతంలో దాడిని ప్రారంభించి 4.30గంటల ప్రాంతంలో
ముగించింది. ఈ మేరకు ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)
లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ఒక ప్రకటన చేశారు.. పాకిస్తాన్ కూడా ఈ
ఘటనను దృవీకరించక తప్పలేదు.
సర్జికల్ ఆపరేషన్స్ పద్ధతి లో
జరిపిన ఈ దాడిని విజయవంతంగా పూర్తి చేసిన భారత సైన్యం అభినందనలు
అందుకుటోంది.. పార్టీలకు అతీతంగా మన సైన్యం తీసుకున్న నిర్ణయాన్ని
అభినందిస్తున్నారు.. దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.
భారత సైన్యం
చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రధాని నరేంద్రమోదీ ముందుగానే రాష్ట్రపతి
ప్రణబ్ ముఖర్జీకి తెలియజేసారు. దాడి అనంతరం ఆ
వివరాలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్, మరియు అన్ని
రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియజేసారు.
ఇటీవల
ఉరీలో ఉగ్రవాదులు జరిపిన దాడిపై దేశ మంతటా ఆగ్రహావేశాలు
వ్యక్తమయ్యాయి. పాకీలకు గట్టి జవాబు ఇవ్వాలని భారత ప్రభుత్వం
అప్పుడే నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే అదను చూసి మెరుపుదాడికి దిగింది.
No comments:
Post a Comment