13 July, 2016

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించిన భారత పరిక్రమ యాత్ర

దేశంలో గ్రామా వికాస్ కు సంబందించిన అవగాహనా కల్పించడానికి, ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్, శ్రీ సీతారాం కేడిలియ గారు చేపట్టిన భారత పరిక్రమ యాత్ర ఈ రోజు  (జూలై 13-2016) ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించింది. వీరు గతంలో అఖిల భారతీయ సేవ ప్రముఖ్ గా బాద్యతలు నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ను 22 వ రాష్ట్రంగా పరిగణించబడుతుంది. ఓడిశాలోని కోరాపుట్ జిల్లలో ఉన్న చతువ గ్రామం నుండి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం జిల్లా అరకు గ్రామంలో  ప్రవేశించింది.

ఆగష్టు 9, 2012, నాడు కన్యాకుమారి లో కాలి నడక తో ప్రారంభమయిన ఈ భారత పరిక్రమ యాత్ర నేటికి (1436 రోజు) దాదాపు 20,000 కిలోమీటర్ల మేర కొనసాగింది. మార్గ మద్యలో 22 రాష్ట్రాల గుండా నడుస్తూ 1850 గ్రామాలను సందర్శించడం జరిగింది.  ఈ యాత్ర  5 సంవత్సరాల పాటు ఇలానే కొనసాగుతూ తిరిగి చివరికి కన్యాకుమారి గురు పూర్ణిమ నాడు అనగా జూలై 9, 2017 నాడు ముగుస్తుంది. 



68 ఏళ్ళ వయసులో ఉన్న సీతారాం వారి ఈ మహా కాలినడక,  మే 25, 2016 నాడు ఛత్తీస్ గడ్ లో ప్రవేశించింది.  ఆ రాష్ట్రంలో ఆద్యాత్మిక గురువు అయిన బాబా సత్యనారాయణ స్వామిగారి ను వారు కలుసుకున్నారు. యాత్ర లో భాగంగా భారత  దేశంలో ని ప్రముఖ స్థలాలు అయిన విశాఖపట్టణం, శ్రీశైలం , పుట్టపర్తి, తిరుపతి, కర్ణాటక లోని ముద్దనహళ్లి (సరిహద్దు ప్రాంతం), తదుపరి తమిళనాడు లోని తిరువన్నమలయి, పాండిచేరి ల మీదుగా కన్యాకుమారికి చేరుకుంటుంది.

ఇప్పటివరకు ఆర్.ఎస్.ఎస్ సర సంఘచలాక్ మోహన్ జి భాగవత్ గారు రెండు సార్లు ఈ భారత పరిక్రమ యాత్రలో పాల్గొన్నారు. మొదటగా జనవరి 2013 లో మహారాష్ట్ర పాన్వెల్ లో రెండవసారి సెప్టెంబర్ 8, 2013 నాడు రాజస్తాన్ సీకర్ జిల్లాలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈ యాత్ర  ముఖ్య లక్షం భారత దేశంలోని గ్రామీణ ప్రజల అభివృద్ధి అని, సహజ సిద్ధమైన వనరులు అయిన నీళ్ళు, భూమి, గోవులను సంరక్షించడమే అన్నారు. 


సీతారాం కేడిలియ గారు ఈ యాత్ర వివరాలు తెలియ చేస్తూ, ప్రతి రోజు 10 కిలో మీటర్ల  వరకు నడిచి దగ్గరలోని గ్రామంలో విశ్రాంతి తీసుకుంటానని అన్నారు. ప్రధానంగా గ్రామాలలోని యువకులును, గ్రామా పెద్దలతో కలిసి అక్కడి సమస్యలపై మాట్లాడం, ముఖ్యంగా అనారోగ్యం తో ఉన్నవారిని, అంగ వైకల్యం ఉన్నవారిని, కంటి చూపు లేని వారిని కలవడం వారితో మాట్లాడడం. వీటి ద్వార ఒకప్పుడు ప్రజల మద్య ఉన్న బంధాలని గుర్తు చేస్తూ ఒకే కుటుంబం అని భావాన్ని కల్పించడం. కొన్ని కారణాల వలన ఇలాంటి ఆలోచన లేని కారణంగా చాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఈ సమస్యలు దేశ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాయి. ఒక్కటే అనే భావన, కుటుంబ సంబంధాలను తిరిగి గ్రామలలోకి తీసుకొని వస్తే చాల వరకు ప్రజల మధ్య సహ్రుద్బవ వాతావరణాన్ని తిరిగి మనం చూడ గలుగుతాము. దీని ద్వారా “వసుధైవ కుటుంభకం” అని భావనను మనం ప్రేరేపించిన వాళ్ళం అవుతాము. ఈ విషయాలతో కూడుకొని యాత్ర మరొక గ్రామం లోకి ప్రయాణిస్తుంది.  

ఈ యాత్ర లో సీతారాం కేడిలియ గారి నినాదం “భారత్ ను తెలుసుకో, భారతీయతను కలిగి ఉండు, భారత దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టు”. ఈ యాత్ర కారణాలు స్పష్టం, ప్రస్తుత పరిస్థుతులలో జీవితాలను  కేవలం వ్యాపార, భౌతిక పరమైన, లాభ నష్టాల కోణంలో చూడడం జరుగుతుంది.  దీని కారణంగా పేదరికం, నిరుద్యోగం, అవినీతి పెరిగిపోయాయి. ఇంకో రకంగా చూస్తే  ప్రపంచం మొత్తం ఒక రణ రంగం, అందు కారణంగా జీవితం అంటే నిత్యం సంఘర్షణనే అనే భావన.  ఇలాంటి ఆలోచనల వలన అహింస, తీవ్రవాదం, చేతిలో ఆయుధాలు కలిగి ఉండడం జరుగుతుంది. దీని పరిణామంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక విధమైన అల్లకల్లోల్లం, అస్థిరత  ఏర్పడి ప్రజలు శాంతి కొరకు ఒక పెనుగులడుతున్నారు.   ఇలాంటి విపత్కర పరిస్థుతలలో ఏకాంతం కేవలం భారత్ లోనే అని ప్రజలు తెలుసుకుంటారు. వీటన్నిటి మూలంగా కీలకంగా మూడవది అయిన “ప్రపంచం ఒక కుటుంబం అని, జీవితం ఒక ద్యోతకం” అనేది తెలుసుకుంటారు అని అన్నారు.

గతవారం జూలై 2016 లో ఓడిశా లో భారత పరిక్రమ యాత్ర దృశాలు:









No comments:

Post a Comment