09 August, 2016

హిందూ ధర్మంలో అస్పృశ్యతకు తావులేదు - ఆర్.ఎస్.ఎస్ సహ సర్కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హాస్‌బళే



హిందూ ధర్మంలో ఎక్కడ అస్పృశ్యతకు తావులేదని ఈశావాశ్య మిదం సర్వంఅంటే ఈశ్వరుడు అందరిలోనూ, అన్నీచోట్ల ఉన్నాడని, ధనికులోనూ, పేదవారిలోనూ కూడా సమానంగా ఉన్నాడని మనవేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు చెబుతున్నాయి అని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోస్‌బళే గారు అన్నారు.

హోస్‌బళే గారు విజయవాడలోని జనసంక్షేమ సమితి ఆధ్వర్యంలో  ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుచేత నిర్మించిన ‘‘హైందవి’’ కార్యాలయం యొక్క గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా జరిగిన సభకు ముక్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఆగష్టు 4, 2016, సాయంత్రం 6 గం॥కు కు జరిగింది.



హిందూ ధర్మంలో చిన్న, పెద్ద, అగ్రవర్ణం, నిమ్నకులం అనే భేదభావంలేదని చెప్పారు. అయినప్పటికీ  నిమ్నకులా వారిని యుగయుగాలుగా అణచివేతకు గురిఅయ్యారని వారిని సమానంగా చూడవసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ దత్తాజీ అన్నారు. వేదాలో “నప్రజా నధనం” అని చెబుతుందని అందుచేత అందరూ ఆ వేదవాక్యాను గుర్తుచేసుకోవాని అన్నారు. వివేకానందుడు సేవ, త్యాగం పర్యాయపదాని అన్నారని, సేవ, త్యాగం మనరక్తంలో ఉందని అని అన్నారు. ‘‘త్యాగేనైక అమృతమానసః’’ అంటే సమాజంలో అమృతత్వం కోసం అనేకమంది అనేక త్యాగాలు చేశారని, బాహుబలి సమాజంకోసం పనిచేసాడని అందుచేతనే కర్ణాటకలో ఆయనకు 56 అడుగు విగ్రహం పెట్టారని అన్నారు. సిద్ధార్థుడు రాజు అయినప్పటికీ సర్వంత్యాగంచేసి గౌతమ బుద్ధుడిగా నీరాజనాలు అందుకుటుటన్నాడని అన్నారు. త్యాగం మనధర్మంలో ఉందని అన్నారు. కుటుంబ వృద్ధి అంటే వంశవృద్ధి కాదని, మన సంస్కృతిని, ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేది మాత్రమే అని అన్నారు. మన కుటుంబ వ్యవస్థ చాలా బమైనది అందుచేత మనం ఇంకా మిగిలి ఉన్నామని వారు అన్నారు.

ఇటీవల ఇంగ్లాండులో జరిగిన హిందూ స్వయంసేవక సంఘ్ 50వ వార్షికోత్సవంలో 100 శాఖనుండి 300 మంది పాల్గొన్నారు ఆ కార్యక్రమం లో పాల్గొనా శ్రీ దత్తాజీ 15-20  సం॥ వయస్సున్న యువతీ యువకును ప్రశ్నించారు. హిందువునని మీరు గర్వపడుతున్నారా అని అడాగారు. వారు దానికి ఔనని సమాధానమిస్తూ హిందుత్వం ఒకమతం కాదు ఒక జీవనవిధానం అని చెప్పారు అని గుర్తు చేస్తూ వారు చెప్పింది సత్యం అని అన్నారు.

జూన్‌ 21వ తేదిన ప్రపంచం యోగాదినోత్సవంను 193 దేశాలు జరుపుకున్నాయి. మన ఋషులు విశ్వానికి అందించిన గొప్పవరం యోగ విద్య. దీనితో పాటుగా అనేక విద్యలు అందించారు. కుటుంబ వ్యవవస్థ, పర్యావరణం పట్ల దృష్టి, జడ చేతనలో ఈశ్వరున్ని చూసే దృష్టి ఈ ప్రపంచానికి అందిచాము. ప్రపంచంలో కొందరు మా మతం గొప్పది, నా దేవుడు గొప్పవాడు అనే విధానంవలన రక్తపాతం జరుగుతోంది. నక్సలైట్లు, తీవ్రవాదులు పెరిగిపోయారు. మానవహక్కు ఉల్లంఘన అంతటా జరుగుతుంది.

మనం స్త్రీని సరస్వతిగా, దుర్గగా, క్ష్మీగా కొలుస్తాం మరియు గౌరవిస్తాం,కానీ నేడు మన మహిళపై అత్యాచారాలు పెరిగిపోయాయి. స్త్రీని విలాస వస్తువుగా భావించే పరిస్థితి వచ్చింది. ఒకే గ్రామంలో ఉన్న ప్రజకు ‘నీరు, స్మశానం లాంటివి ఒక్కటిగా లేవు. దేవాయ ప్రవేశం లేదు. ఇంకా చాలా గ్రామాలో అస్పృశ్యతను పాటిస్తున్నారు. సామాజిక సమరసత లేదు. ఈశ్వరుడు ధనికు ఇంట్లోనే కాదు పేదవాని గుడిశెలలోనూ ఉన్నాడు. హిందుత్వం సమానత్వం చాటుతుంది. సముత్కర్ష నిశ్రేయఅందరూ అత్యున్నత స్థాయికి చెందానేది, అందరూ బాగుండాని కోరేదే మన ధర్మం. హైందవ సంస్కృతి శస్త్రానికి, శాస్త్రానికి సంతునం సాధించింది. సత్యం సనాతమైనదని మన పెద్దలు చెబుతారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. గత 90 సం॥లుగా దేశ పరమ వైభవస్థితికై ఒక ఉద్యమంలాగా పనిచేస్తోంది. దానికి అనుగుణంగా ఆ పని లో భాగంగా సమర్ధత నిబద్ధత కలిగిన కార్యకర్తను తయారు చేస్తోంది. దేశపునర్నిర్మాణ కార్యక్రమం సంఘం యొక్క పని. ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు భవనాలు, వసతులు అక్కర్లేదు. ఖాళీస్థలాలోనే సంఘం పెరుగుతుంది. కానీ జనసంక్షేమ సమితి, సేవాభారతి లాంటి అనేక సంస్థలు ఈ దేశ పునర్నిర్మాణ కార్యక్రమంలో పనిచేస్తున్నాయి. వాటికోసం ఒక కేంద్ర స్థానం కావాని అందుకోసం ఈ హైందవి భవన నిర్మాణం జరిగింది. 



ఈ రోజు ‘హైందవి’ కార్యక్రమంలో ‘‘భారత్‌ దర్శన్‌’’ పుస్తకావిష్కరణ మరియు డి.వి.డి ఆవిష్కరణ జరిగింది. హైందవి భవనం ఒక దీప స్థంభంలాగా అనేక కార్యక్రమాకు స్థానం కావాని మనం ఎంత ఎత్తులో విశాలంగా భవన నిర్మాణం చేసామో అదే విధంగా అంతే ఎత్తులో అంతే విశాలంగా మన సంఘ కార్యం విస్తరించాలి ’’ అని అన్నారు.

సభా కార్యక్రమానికి ముందు భువనేశ్వరీ పీఠాధిపతి, కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వేద స్వస్థి మధ్య ‘హైందవి’ గృహ ప్రవేశ కార్యక్రమమును నిర్వహించారు. భారత మాత చిత్రపటానికి పూమా వేశారు. తదనంతరం జరిగిన సభలో కూడా వీరు తమ ఆశీఃప్రసంగం చేశారు. వారి ప్రసంగంలో సేవ, త్యాగం, జాతీయ భావం గురించి అనేక విషయాలు చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి వారి దివ్యాశీస్సులు అందించారు.

సభా కార్యక్రమానికి క్షేత్ర కార్యవాహ మా॥ దూసి రామకృష్ణ, ప్రాంత సంఘచాక్‌ మా॥ సుందరమూర్తి, జన సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసు గారు పాల్గొన్నారు. సభా కార్యక్రమాన్ని జనసంక్షేమ సమితి సంయుక్త కార్యదర్శి శ్రీ కోనేరు దుర్గా ప్రసాదు గారు నిర్వహించారు. 

సభాకార్యక్రమానికి ముందుగా శ్రీ విజ్ఞాన విహార పాఠశా విద్యార్థినీ, విద్యార్థుచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.




No comments:

Post a Comment