'వందే
మాతరం' అనేది రెండు పదాలు కలిగిన నినాదం, కానీ తరతరాల నుంచి భారతీయుల దేశభక్తి ని తట్టి లేపుతోంది, అట్లే భవిష్యత్తు
తరాలను కూడా ప్రభావం చేయగల శక్తి ఉన్ననినాదం.
21 సెప్టెంబర్, 2016 నాడు, రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 'హిందూ స్పిరుచ్యుల్ మరియ సేవా ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'వాయిస్ అఫ్ యూనిటీ ' అనే పేరుతో నిర్వహించిన
కార్యక్రమంలో లక్షకు పైగా ప్రజలు పాల్గొని అందరు ఒక్కసారి వందేమాతర గీతాన్ని ఆలపించారు, అది మన చరిత్ర
లోనే ఒక గొప్ప రికార్డు.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి వచ్చిన
ఐదు వందల నాలుగు మంది కళాకారులు, పద్దెనిమిది రకాల
వివిధ సంగీత వాయిద్యాలను వాయించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఆర్.ఎస్.ఎస్ అఖిల్
భారతీయ సహ సేవా ప్రముఖ్ శ్రీ గుణవంత్ సింగ్ జీ, విశ్వ విభాగ్
శ్రీ రవికుమార్ జీ, అఖిల్ భారతీయ సహ
శారీరఖ్ శిక్షణా ప్రముఖ్ శ్రీ జగదీష్ జీ, సహ బౌధ్దిక్
ప్రముఖ్ శ్రీ ముకుంద్ జీ ,క్షేత్ర ప్రచారక్ శ్రీ దుర్గాదాస్ జీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వసుంధరా రాజే , ఆమె ప్రసంగంలో
మాట్లాడుతూ, “మన పౌరులు అంకిత భావాన్ని మరియు
దేశభక్తి ని కలిగి ఉన్నారన్న ఒక గొప్ప సందేశాన్ని ఈ కార్యాక్రమం తెలుపుతోంది” అని అన్నారు
.
No comments:
Post a Comment