04 October, 2016

భాగ్యనగరంలో రాష్ర్ట సేవికాసమితి అధ్వర్యంలో విజయదశమి ఉత్సవం


1936 సం విజయదశమి రోజున ప్రారంభించబడి గత 80 సంలుగా స్త్రీలలో శారీర, మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తూ సమాజ కార్యంలో ముందుకు దూసుకెళుతున్న అత్యంత బృహత్ మహిళా సంఘటన రాష్ట్ర సేవికా సమితి సమితి నిర్వహించు సామాజిక ఉత్సవాలలో ఒకటి విజయదశమి ఉత్సవం. సంవత్సరం భాగ్యనగరంలోని ఈ.సి.ఐ.ఎల్ మనీషా గార్డెన్లో ఆదివారం (2-అక్టోబర్-2016) సా 5.గంలకు విజయదశమి ఉత్సవము నిర్వహించడం జరిగింది.  


ఈ కార్యక్రమం లో భాగంగా సుమారు 300 మంది సేవికలు రెండు విభాగాలుగా విడిపోయి .ఎస్. రావు నగర్, శిశ-మందిర్ నుండి పథసంచలన్ (రూట్ మార్చ్) చేసారు. దారిపొడవునా వివిధ కూడళ్ళలో ఏర్పాటు చేయబడిన వేదికల వద్ద సంచలనంలో పాల్గొన్న మహిళలకు, పట్టణ పౌరులు పుష్పాలు, హారతులతో ఘనంగా స్వాగతించారు. బాలబాలికలు దేవి దేవతలు, జాతీయ నాయకుల వేష భాషలతో అలరించారు.  భారతమాతకీ జై అనే నినాదాలు మిన్నంటాయి


సంచలన్ అనంతరం నిర్వహించబడిన విజయదశమి ఉత్సవంలో శ్రీమతి డా హరి అనుపమగారు అధ్యక్షురాలిగా, రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ సహ బౌద్ధిక్ మరియు ప్రచార ప్రముఖ్ మాననీయ శ్రీమతి సునీల సోవనీ గారు ముఖ్యవక్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో సమితి సేవికులచే అత్యద్భుతమైన ఘోష్, దండ, కోలాటం వంటి శారీరక విన్యాసాలను ప్రదర్శించారు


 
అనంతరం డా హరి అనుపమగారు మాట్లాడుతూ మనం విజయదశమి నవరాత్రులలో విజయంను ప్రకటిస్తూ దుర్గమాతను స్థుతిస్తాము. దేవి చేసిన దుష్టశిక్షణ మనకు ఆదర్శం. దేవిలో ఉన్న అష్టశక్తులు మనం ఆపాదించుని ఏకమత్యంలో స్త్రీలు తమ కర్తవ్య నిర్వాహణ చేయాలని, సమాజంలో కనుమరుగవుతున్న సంస్కారాలను మేల్కొలిపి సమాజసేవలో పాల్గొనాలని  పిలుపునిచ్చారు



ముఖ్యవక్తగా విచ్చేసిన సునీల సోవనీ గారు మాట్లాడుతూ విజయదశమికి ముందే మనం సామూహిక విజయాన్ని పొందాము. ప్రపంచమంతా మన సైనికుల శౌర్య పరాక్రమాలను ఏకకంఠంతో ప్రశంసిస్తుంది. అయినప్పటికీ అవిధ్య, అనైతికత వంటి మొదలైన దేశాంతర్గత అంశాల పట్ల విజయాలను పొందాల్సి ఉంది. ఇలాంటి అంతర్నిహిత శతృవులను అంతమొందిస్తేనే సర్వాంగీణ విజయం అవుతుంది. మార్గంలోనే మహిళలలో ప్రత్యక్షకార్యం చేస్తున్న మహిళా సంఘటన రాష్ట్రసేవికా సమితి  అని వారు తమ సందేశాన్నిఅందించారు.

కార్యక్రమంలో ప్రాంత సంచాలిక మా అరుణక్క, మా రాధక్క, మా జ్యోతక్క, శ్రీమతి లక్ష్మీప్రసన్న మరియు ఇతర ప్రాంత, విభాగ్ అధికారులతో పాటు 680 మంది సేవికలు, సంఘ బంధువులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment