2015 నవంబర్
8వ తేది నాడు కేశవ
మెమోరియల్ హైస్కూల్లో సమాచార భారతి
ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సోషల్ మీడియా
ప్రశిక్షణ వర్గ నిర్వహించబడింది. ఈ
కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని జిల్లాల నుంచి
152 ఔత్సాహిక సోషల్ మీడియా
కార్యకర్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాలో నిష్ణాతులైన
శ్రీ. కిరణ్ కెఎస్ బెంగళూరు, ప్రముఖంగా
శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ (ప్రచార విభాగం
అఖిల భారత కార్యకారిణి సభ్యులు), శ్రీ.ప్రదీప్
(తెలంగాణ ప్రాంత సోషల్ మీడియా
సంయోజక్), శ్రీ.జ్యోతిశర్మ
(ఐటీ మిలన్్ కార్యకర్త), ఎబీఎన్ ఛానెల్లో
పనిచేస్తున్న శ్రీ.వక్కలంక కిషోర్, శ్రీ. నందు,
శ్రీ.ఉమామహేశ్వర్రావుగారు
రచన జర్నలిజం కాలేజీ ప్రిన్స్పల్ శిక్షణ ఇచ్చారు.
శ్రీ.కిరణ్ కుమార్ సోషల్
మీడియా యొక్క ఆవశ్యకత, ప్రస్తుత
పరిస్థితులు జాతీయ దృష్టి కోణంలో
మనం ఏమి చేయాలి? ఇటువంటి
విషయాలను వివరించి చెప్పారు. శ్రీ. ఉమామహేశ్వర్రావుగారు మాట్లాడుతూ మీడియా ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి?
ఒక వార్తను వివిధ మాధ్యమాలు వాటి
దృష్టి కోణంలో ఎట్లా వివరిస్తుంటాయి, దాని
కారణంగా వాస్తవ విషయాలు ప్రజలకు అర్థం కాకుండా ఎలా
చేస్తుంటాయి ఇలాంటి విషయాలను వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో
సైబర్ లా గురించి
కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాకు సంబంధించిన
ప్రాంత కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సమాచార
భారతి ప్రధాన కార్యదర్శి ఆర్.మల్లికార్జునరావు,
శ్రీ.రాఘవేంద్ర, (సమాచారా భారతి కోశాధికారి), శ్రీ.వేది నర్సింహం, శ్రీ.శ్రీనివాస్మూర్తిగారు
(సమాచారా భారతి కమిటీ సభ్యులు)
మరియు శ్రీ.జానకిరాం (విశ్వసంవాద
కేంద్ర ప్రముఖ్), ప్రముఖ కార్యకర్తలు
పాల్గొన్నారు. కొద్ది మంది ప్రముఖ జర్నలిస్టులు
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన
ప్రచార ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో
శిక్షణ పొందినవారు కొంత మంది బ్లాగ్స్ ఓపెన్
చేసారు. ఈ కార్యక్రమం అప్పుడప్పుడు
జరుగుతూ ఉండాలని పాల్గొన్నవారు తమ అభిప్రాయాలని వ్యక్తం
చేశారు. ఈ కార్యక్రమం సా॥ 5.15కి ఈ కార్యక్రమం పూర్తయింది.
No comments:
Post a Comment