రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ
వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని “స్వచ్చ కేరళ –హరిత కేరళ-సుందర కేరళ” అనే నినాదంతో పని చేయాలి అని రాష్ట్రీయ స్వయం సేవక్
సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) కేరళ ప్రాంతం
వాళ్ళు రెండు రోజుల సమావేశం సందర్బంగా తీర్మానం చేసారు.
ఈ తీర్మానం గత వారం ఖాజికోడే
లో జరిగిన సమావేశాలలలో తీసుకొనడం జరిగింది. ఇందులో ప్రదానంగా పేర్కొన్న అంశాలు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు కూరగాయలు మరియు పండ్ల గురుంచి ఇతర రాష్ట్రాలపై
ఎక్కువగా ఆధారపడాల్సి రావడం, ఒక వినిమయ రాష్ట్రంగా మార్పు చెందడం. ఇప్పటి తరం వాళ్ళు
వ్యవసాయం పై అనాసక్తి చూపడం. వ్యవసాయం లో ఎక్కువగా రసాయన మందుల వినియోగం ద్వార నేల సారవంతం, నీరు కలుషితం కావడం.
"ఇప్పుడు ప్రజలందరు తిరిగి సేంద్రియ
వ్యవసాయ పద్దతులను అనుసరించాల్సిన సమయం ఆసన్నమయింది" అని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది.
ఈ తీర్మానం లో ప్రకృతి
సంరక్షణ, పర్యావరణం పై అవగాహన కల్పించే విషయాలను స్కూల్ సిలబస్ లో చేర్చాలి అని, వృక్షాయుర్వేదం,
నక్షత్రవనం, నక్షత్రవీక్షం గురుంచి విద్యార్థులకు చెప్పాలి అని అన్నారు. పంట సంరక్షణ,
నీటి వినియోగం పై ఉన్న చట్టాలను అమలు చేయాలి అని పేర్కొన్నారు.
No comments:
Post a Comment