కేంద్రం లోని ఎన్.డి.ఏ
ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన తరువాత తమ కేంద్రమంత్రి మండలిని పునర్ వ్యవస్థీకరించింది.
అందులో భాగంగా 19 మందిని మంత్రులుగా
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారితో ప్రమాణం
చేయించారు.
మంత్రులుగా
ప్రమాణం చేసినవారు.
ఫగ్గన్‌సింగ్
కులస్తే (మధ్యప్రదేశ్-బీజేపీ),
అహ్లూవాలియా
(పశ్చిమబెంగాల్-బీజేపీ),
రమేష్ జిగా
జినాగి (కర్ణాటక-బీజేపీ),
విజయ్ గోయల్
(రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ- బీజేపీ),
రాందాస్ అథవాలే
(మహారాష్ట్ర- ఆర్పీఐ),
రాజన్ గోహైన్
(అసోం-బీజేపీ),
అనిల్‌మాధవ్ దవే
(మధ్యప్రదేశ్-బీజేపీ),
పురుషోత్తం
రూపాలా (గుజరాత్- బీజేపీ),
ఎం.జె.అక్బర్
(జార్ఘంఢ్- బీజేపీ),
అర్జున్ రాం
మేఘావాల్ (రాజస్థాన్- బీజేపీ),
జశ్వంత్‌సిన్హ్
భాభోర్ (గుజరాత్-బీజేపీ),
మహేంద్రనాథ్
పాండే (ఉత్తరప్రదేశ్- బీజేపీ),
అజయ్ టమ్‌టా
(ఉత్తరాఖండ్- బీజేపీ),
కృష్ణారాజ్-
(ఉత్తరప్రదేశ్- బీజేపీ),
మన్షుఖ్
మాండవీయ- రాజ్యసభ ఎంపీ, (గుజరాత్, బీజేపీ),
అనుప్రియ పటేల్-
లోక్‌సభ ఎంపీ, (ఉత్తరప్రదేశ్,
అప్నాదళ్),
సీఆర్ చౌదరి
(రాజస్థాన్- బీజేపీ),
పీపీ చౌదరి- లోక్‌సభ
ఎంపీ, (రాజస్థాన్,
బీజేపీ),
సుభాష్ భామ్రే
(మహారాష్ట్ర-బీజేపీ) .
ప్రస్తుతం సహాయ
మంత్రిగా ఉన్న ప్రకాశ్‌జవదేకర్‌కు పదోన్నతి లభించింది. కేబినెట్ మంత్రిగా ప్రమాణం
చేశారు.
మంత్రుల బాద్యత
నుండి తొలగించిన వారు - నిహాల్ చాంద్, రామ్
శంకర్ కటారియా, సన్వర్లాల్ జాట్, మానుసఖ్ భాయి డి
వాసవ మరియు ఎం కే కుంధరియ.
ఈ కార్యక్రమానికి
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని
నరేంద్రమోదీ, భాజపా జాతీయ
అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు
ఆరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్,
జేపీ నడ్డా, బండారు దత్తాత్రేయ, నితిన్‌గడ్కరీ, సదానందగౌడ, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.
Congrats to newly sworn-in colleagues. Lets work together to bring a positive difference & for #TransformingIndia. pic.twitter.com/Xo8naAyd0S— Narendra Modi (@narendramodi) July 5, 2016
No comments:
Post a Comment